తిలక్, స్వాతిలకు టైటిల్స్ | Tilak, Swati won world 10k Bangalore titles | Sakshi
Sakshi News home page

తిలక్, స్వాతిలకు టైటిల్స్

Published Mon, May 19 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

తిలక్, స్వాతిలకు టైటిల్స్

తిలక్, స్వాతిలకు టైటిల్స్

బెంగళూరు: వరల్డ్ 10కే బెంగళూరు రన్‌లో భారత్ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో బి.సి.తిలక్, స్వాతి విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ రేస్‌లో 10 కిలోమీటర్ల దూరాన్ని తిలక్ 30 నిమిషాల 26 సెకన్లలో... స్వాతి 37 నిమిషాల 22 సెకన్లలో అధిగమించారు. అనీష్ థాపా (30ని:38 సె), నితేంద్ర సింగ్ రావత్ (30ని:47సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
 
 మహిళల విభాగంలో జయశ్రీ (37ని:35సె), సుప్రియా పాటిల్ (37ని:46సె) రెండు, మూడు స్థానాలను పొందారు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో జెఫ్రీ కమ్‌వోరర్ (కెన్యా-27ని:44 సెకన్లు)... మహిళల విభాగంలో లూసీ కబూ (కెన్యా-31ని:48 సెకన్లు) టైటిల్స్ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement