వెల్లువెత్తిన అభిమానం
సాక్షి,హైదరాబాద్:అభిమానం వెల్లువెత్తింది... జోరువానను సైతం లెక్కచేయక.. జయహో జగన్ అన్న నినాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టును హోరెత్తించింది. తొమ్మిది నెలలు, పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. ప్రజాప్రస్థానం పాదయాత్రను ముగించుకుని సోమవారం ఉదయం విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల మధ్య షర్మిల శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరు గా చంచల్‌గూడ జైలుకు వెళ్లి ములాఖత్‌లో తన సోదరుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను ఆమె ప్రజల పక్షాన జగన్‌మోహన్‌రెడ్డికి వివరించినట్లు సమాచారం. వైఎస్ కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని షర్మిల ఈ సందర్భంగా జగన్‌తో పంచుకున్నారు. ములాఖత్ అనంతరం షర్మిల వేలాదిమంది అభిమానులు,
భారీ కాన్వాయ్‌తో వెంటరాగా లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి నర్సింగ్‌రావు, కె.శివకుమార్, బి.జనార్దన్‌రెడ్డి, పి.విజయారెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ రహమాన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్, ిసీఈసీ సభ్యులు మతీన్ ముజదాది, యువజన, సేవాదళం కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, ఆయా నియోజకర్గాల సమన్వయకర్తలు దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్, శీలం ప్రభాకర్, సురేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమళ్ల సిద్దేశ్వర్, రూపానందరెడ్డి, శ్రీలక్ష్మీ తదితరుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.