పాల కేంద్రాలు.. ప్రత్యేక బస్సులు
Published Thu, Aug 8 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
లాలాపేట, న్యూస్‌లైన్/సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని లాలాపేటలోని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జంట నగరాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు విక్రయాలు కొనసాగుతాయి. లీటర్ రూ.32 చొప్పున పాలను విడిగానూ, ప్యాకెట్ రూపంలోనూ విక్రయిస్తామని విజయడైరీ ఎండీ డాక్టర్ మహ్మద్ అలీరఫత్ బుధవారం తెలిపారు.
విడిగా పాలు విక్రయించే కేంద్రాలు: నాంపల్లి, ఆజంపుర, దారుల్‌షిఫా, బేగంబజార్, బహదూర్‌పుర, సనత్‌నగర్, హెచ్‌ఏఎల్ క్యాంపస్, అమన్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, ముషీరాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, గోల్కొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, రాంగోపాల్‌పేట, పంజగుట్ట, సచివాలయం, ఎర్రగడ్డ, బోరబండ, ఏసీగార్డ్స్, మల్లేపల్లి, చిలకలగూడ, మౌలాలి.
ప్యాకెట్ పాల విక్రయ కేంద్రాలు: కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, పటాన్‌చెరు, చాంద్రాయణగుట్ట, మోతీగల్లి, షమ థియేటర్, కాలాపత్తర్, సైదాబాద్, రెయిన్‌బజార్, నల్గొండ క్రాస్‌రోడ్డు, మాదన్నపేట, మురాద్‌నగర్, జానకినగర్, శశిగార్డెన్, సయ్యద్‌నగర్, టప్పాచపుత్ర, సీతారాంబాగ్, రాజ్‌భవన్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, సుల్తాన్‌నగర్, మాణికేశ్వరినగర్, నార్త్‌లాలాగూడ, వారాసిగూడ, హెచ్‌ఎంటీనగర్, తార్నాక, శాంతినగర్.
వివరాలకు ఫోన్: 040-27019851, 040-64643133, 9848172642, 9848172640, 9912526611.
ఈద్గాకు ప్రత్యేక బస్సులు
రంజాన్ సందర్భంగా శుక్రవారం మీరాలం ఈద్గా వద్ద జరిగే ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరుల కోసం 36 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు ఈద్గాకు చేరతాయి. నమాజు అనంతరం సైతం ఇవి అందుబాటులో ఉంటాయి.
Advertisement
Advertisement