ఆర్‌బీఐ నిబంధనలు పాటించని మహేశ్ బ్యాంకు! | The central bank regulation, Mahesh bank! | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ నిబంధనలు పాటించని మహేశ్ బ్యాంకు!

Published Mon, Nov 14 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

ఆర్‌బీఐ నిబంధనలు  పాటించని మహేశ్ బ్యాంకు!

ఆర్‌బీఐ నిబంధనలు పాటించని మహేశ్ బ్యాంకు!

అబిడ్స్: ఆర్‌బీఐ నిబంధనలు పాటించకుండా మహేశ్ బ్యాంకు యాజమాన్యం సామాన్య జనాలను ఇబ్బంది పెడుతోందని పలువురు ఆరోపించారు. ఆదివారం బేగంబజార్‌తోపాటు పలు చోట్ల ఉన్న మహేశ్‌బ్యాంకు శాఖలకు నగదు మార్పిడి కోసం వచ్చిన జనాలను సిబ్బంది పట్టించుకోలేదు. కేవలం ఖాతాదారులకు మాత్రమే తాము నగదు మార్పిడి చేస్తామని చెప్పకొచ్చారు. దీంతో గంటలతరబడి క్యూలో నిల్చున్న వారు ఇబ్బందిపడ్డారు.

ఈ విషయమై బేగంబజార్ మహేష్ బ్యాంక్ వద్ద గంటల తరబడి లైన్‌లో నిలబడ్డ పాతబస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహేష్ బ్యాంక్‌పై ఆర్బీఐలో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మహేష్‌బ్యాంక్‌లో ఉన్న సీసీ ఫుటేజీలను చూస్తే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపుతున్న దృశ్యాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement