Sansabad Airport
-
పుష్పక్ విలాపం
ఎయిర్పోర్ట్ సర్వీసులు.. =నష్టాల బాటలో పయనం =ప్రయాణికుల ఆదరణ కరువు =ఆదాయానికి మించిన ఖర్చు =అయినా అదే బాటలో ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: ‘పుష్పక్’లు ఆపసోపాలు పడుతూనే నష్టాల బాటలో చాలా ఇష్టంగా పరుగులు తీస్తున్నాయి. తెల్ల ఏనుగుల్లా మారిన వీటిని 11 నెలలుగా ఆర్టీసీ బలవంతంగా నెట్టుకొస్తోంది. బస్సు బయటకు తీస్తే నష్టాలు.. మున్ముందు డబ్బులొస్తాయనే ఆశ లేదు.. అయినా బయటపడే ప్రయత్నం చేయట్లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరం నుంచి రవాణా సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ నడుపుతున్న ‘పుష్పక్’ బస్సులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నా.. జీఎమ్మార్ వంటి ఓ ప్రైవేట్ సంస్థ కోసం భారీ నిర్వహణ ఖర్చును భరిస్తూ ఈ బస్సుల్ని నడపడంపై విమర్శలున్నాయి. నగరంలో వెయ్యి రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఏ రూట్లోనైనా వరుసగా వారం, పది రోజుల పాటు నష్టాలొస్తే ఆ రూట్లో బస్సుల రద్దుకు వెనుకాడని ఆర్టీసీ ఏకంగా 11 నెలల పాటు వరుస నష్టాలతో ఎయిర్‌పోర్టుకు బస్సులు నడపడంలోని ఆంతర్యం అంతుబట్టడం లేదు. పైగా వరుస నష్టాలొస్తే ఏ క్షణంలోనైనా బస్సులను విరమించుకోవచ్చనే ఒప్పందం కూడా ఉంది. అయినా ఆర్టీసీ బయటపడకపోవడం చూస్తుంటే రెండు సంస్థల మధ్య ఏదో ‘ఒప్పందం’ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగ్గిన బస్సులు... గతేడాది డి సెంబర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి నగరం నుంచి నాలుగు ప్రధాన రూట్లలో 30 పుష్పక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 23 నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా, సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం మీదుగా కొన్ని బస్సులు నడుస్తున్నాయి. జేఎన్టీయూ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా మరికొన్ని వెళ్తున్నాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టిన కొత్తలో మరిన్ని రూట్లకు విస్తరించాలని, బస్సుల సంఖ్యను 30 నుంచి 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ గత్యంతరం లేని పరిస్థితుల్లో 7 బస్సులను ఉపసంహరించుకుంది. బస్సుల నిర్వహణకు పెద్ద మొత్తంలో వెచ్చించడమే కాక, పెద్దసంఖ్యలో సిబ్బందిని వినియోగించాల్సి రావడంతో ఒక్కో బస్సుపై రోజూ రూ.5000 మేర నష్టాలు నమోదయ్యాయి. ప్రతి నెలా నష్టాల తీవ్రత పెరుగుతున్నా ఆర్టీసీ మాత్రం జీఎమ్మార్‌తో చెట్టాపట్టాలేసుకొని బస్సులు తిప్పుతూనే ఉంది. 10 శాతం దాటని ఆక్యుపెన్సీ జంటనగరాల ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకొనేందుకు ప్రత్యేక బస్సులు నడపాల్సిన జీఎమ్మార్ సంస్థ ఆ బాధ్యతను టీవీఎస్ కంపెనీకి అప్పగించింది. 2009 నుంచి 2012 వరకు ‘ఎయిరో ఎక్స్‌ప్రెస్’ పేరుతో టీవీఎస్ 27 బస్సులు నడిపింది. ప్రయాణికుల ఆదరణకు నోచుకోని ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ 9 శాతం మించలేదు. ఈలోగా జీఎమ్మార్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ముగియడంతో భారీ నష్టాలను మూటగట్టుకుని బతుకు జీవుడా అంటూ టీవీఎస్ బయటపడింది. దీంతో ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రతి అరగంటకు ఒకటి చొప్పున తిరుగుతున్న ఈ అన్ని బస్సుల్లో కలిపి రోజూ సగటున 660 నుంచి 670 మంది ప్రయాణికులే రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, మెహిదీపట్నం మార్గాల్లోనే 10 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, మిగతా రూట్లలో 8 శాతాన్ని దాటడం లేదు. జేఎన్టీయూ రూట్ బాగుంది పుష్పక్ బస్సులపై మిగతా రూట్లలో రూ.40 ఆదాయమే వస్తోంది. కొద్ది రోజులుగా జేఎన్టీయూ రూట్లో రూ.50 నుంచి రూ.60కి ఆదాయం పెరిగింది. ‘అభయ’ ఉదంతం తరువాత చాలామంది అమ్మాయిలు క్యాబ్‌ల నుంచి పుష్పక్ బస్సులవైపు వస్తున్నారు. - ఏ.కోటేశ్వర్రావు, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
నాగోలు/అత్తాపూర్, న్యూస్‌లైన్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎల్బీనగర్ పరిధిలో ఆర్టీసీ బస్సు బీటెక్ విద్యార్థిని బలిగొనగా...రాజేంద్రనగర్‌లో వేగంగా వచ్చిన కారు యువకుడి ప్రాణం తీసింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురానికి చెందిన కె.ఎలమంద, అంజలి దంపతులు కుమారుడు జయప్రకాశ్ (20) బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు సాగర్రింగురోడ్డుకు వచ్చాడు. ఉప్పల్ నుం చి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్ 2000) ఎక్కేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పి వెనుక చక్రాల కిందపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు ఢీకొని యువకుడు... అనంతపురం జిల్లాకు చెందిన ఓబులేషు(25) డీసీఎంవ్యాన్పై క్లీనర్. వ్యాన్‌పై ఈనెల 7న కొత్తపేట మార్కెట్‌కు పుచ్చకాయలను తీసుకొచ్చా డు. డీసీఎంను ట్రాన్స్‌పోర్టు ఆఫీసు వద్ద పెట్టి ఓబులేషు స్వగ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ ప్రధాన రహదారి ముందు బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ10టీవీ 2210) వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన ఓబులేషును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్పక్ చార్జీల పెంపు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల చార్జీలు పెరిగాయి. కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు మూడు శ్లాబులుగా ఉన్న ఈ చార్జీలను రెండు శ్లాబులుగా కుదించారు. ఈ మేరకు 34 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారిపై రూ.200 చొప్పున 34 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.250 చొప్పున చార్జీలు విధిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.150 ఉన్న చార్జీ రూ.200కి పెరగనుంది. రూ.200 ఉన్న చార్జీ రూ.250కి పెరగనుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఇప్పటి వరకు రూ.200 చార్జీ ఉండగా, ఇక నుంచి అది రూ.250కి పెరగనుంది. అలాగే తార్నాక, ఉప్పల్, సెక్రెటేరియట్ వంటి ప్రాంతాల నుంచి రూ.150 ఉండగా, దానిని రూ.200 కు పెంచారు. ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి సమీప ప్రాంతాల నుంచి ఇప్పటివరకు రూ.100 చార్జీ తీసుకుంటుండగా ప్రస్తుతం సమీప ప్రాంతాల శ్లాబును తొలగించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు దగ్గర గా ఉన్న కేంద్రాల నుంచి వెళ్లే ప్రయాణికులు సైతం రూ.200 చెల్లించుకోవలసిందే. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఎయిర్‌పోర్టులో యువతి వీరంగం
శంషాబాద్, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ యువతి శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించింది. ఆమెతో పాటు నలుగురు స్నేహితులు మడ్ రేసింగ్ గేమ్ షో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆర్జీఐఏ సీఐ దుర్గాప్రసాద్, బాధితుల కథనం ప్రకారం.. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన దీప్తి(25) కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన బంధువులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లో ఓ విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో విమానాశ్రయంలో ఉన్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వచ్చారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. ‘మీ బతుకులు ఇంతే’నంటూ దుర్భాషలాడింది. పరిస్థితిని గమనించిన గేమ్ షో సిబ్బంది దీప్తితో పాటు ఆమెతో ఉన్న వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. వారు వినకుండా సిబ్బందితో గొడవకు దిగారు. సిబ్బంది కి రణ్, విశాల్, శ్రీశైలంపై దీప్తితో పాటు మిగతా నలుగురు దాడి చేశారు. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితో పాటు మిగతా నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వెల్లువెత్తిన అభిమానం
సాక్షి,హైదరాబాద్:అభిమానం వెల్లువెత్తింది... జోరువానను సైతం లెక్కచేయక.. జయహో జగన్ అన్న నినాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టును హోరెత్తించింది. తొమ్మిది నెలలు, పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. ప్రజాప్రస్థానం పాదయాత్రను ముగించుకుని సోమవారం ఉదయం విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల మధ్య షర్మిల శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరు గా చంచల్‌గూడ జైలుకు వెళ్లి ములాఖత్‌లో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను ఆమె ప్రజల పక్షాన జగన్మోహన్రెడ్డికి వివరించినట్లు సమాచారం. వైఎస్ కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని షర్మిల ఈ సందర్భంగా జగన్‌తో పంచుకున్నారు. ములాఖత్ అనంతరం షర్మిల వేలాదిమంది అభిమానులు, భారీ కాన్వాయ్‌తో వెంటరాగా లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి నర్సింగ్‌రావు, కె.శివకుమార్, బి.జనార్దన్‌రెడ్డి, పి.విజయారెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ రహమాన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్, ిసీఈసీ సభ్యులు మతీన్ ముజదాది, యువజన, సేవాదళం కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, ఆయా నియోజకర్గాల సమన్వయకర్తలు దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్, శీలం ప్రభాకర్, సురేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమళ్ల సిద్దేశ్వర్, రూపానందరెడ్డి, శ్రీలక్ష్మీ తదితరుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.