విశాఖపట్నం: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన వెలువడగానే సీమాంధ్రలో విభజన సెగ రగులుకుంది. పెద్దఎత్తున ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలతో అట్టడుకిపోతోంది. రాష్ట్ర విభజనపై సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా తమ కార్యాచరణను రూపొందిస్తోంది. రేపటి నుంచి ఈనెల 11 వరకు జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ కేంద్రాల్లో ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా డివిజన్ సర్కిల్ స్థాయిలో భారీ ర్యాలీలు చేయనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఈ నెల 9న జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ఉద్యోగుల జేఏసీ పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుపై అనుకులంగా కేంద్రం జూలై 30న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సమైక్యాంధ్ర కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ
Published Mon, Aug 5 2013 11:29 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement