CM Kiran Kumar Reddy
-
ఒరిగింది జీరో
అనంతపురం : పైలీన్ సైక్లోన్ను ఆపలేకపోయా కానీ.. రాష్ట్ర విభజన సైక్లోన్ను మాత్రం ఆపే శక్తి తనకుందని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన హయాంలో ‘అనంత’కు ఒరగబెట్టిందేమీ లేదు. మంగళవారం లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మూడు సంవత్సరాల రెండున్నర నెలల పాలనకు తెరపడింది. ఆయన 12 పర్యాయాలు జిల్లాలో పర్యటించి 60 హామీలు ఇచ్చారు. ఇందులో రెండు మూడు హామీలు మాత్రమే అదీ పాక్షికంగా నిలబెట్టుకున్నారు. 1994, 1999 ఎన్నికల్లో ఘెర పరాజయం పాలై జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రతో తన రెక్కల కష్టంతో 2004 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకితెచ్చారు. 2009 ఎన్నికల్లో సైతం ఆయన ఒంటి చేత్తో అధికారాన్ని కట్టబెట్టారు. రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 2009 సెప్టెంబరు 2న వైఎస్ అమరుడయ్యారు. ఆ తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కె.రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం 2010 నవంబర్ 24న బలవంతంగా దించేసింది. ఆ స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టింది. కిరణ్ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎన్.రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖ.. ఎస్.శైలజానాథ్‌కు ప్రాథమిక విద్య శాఖ దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ చివరిసారిగా డిసెంబర్ 23న అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. హామీల్లో ఘనం సీఎంగా కిరణ్ జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ హంద్రీ-నీవా సుజల స్రవంతి తొలి దశ ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని.. రెండో దశ ఆయకట్టుకు 2014లోగా నీళ్లందిస్తామని పదేపదే హామీ గుప్పించారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ-నీవా కాలువ ద్వారా 1.65 టీఎంసీలను మాత్రమే తరలించగలిగారు. ఆయన తొలి సారి రచ్చబండలో భాగంగా 2011 జనవరి 30న గార్లదిన్నెలో పర్యటించారు. ఆ సందర్భంలో పెనకచెర్ల-కత్రిమల మధ్య మధ్యపెన్నార్ డ్యాంపై రూ.16 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చి దానిని విస్మరించారు. కిరణ్ ఇచ్చిన 60 హామీలదీ అదే పరిస్థితి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో మన జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. కర్ణాటక భారీగా లబ్ధి పొందినా చూస్తుండిపోయారు. పెన్న అహోబిలం రిజర్వాయర్‌కు కనీసం పది టీఎంసీలను సాధించుకోవడంలో కూడా కిరణ్ సర్కారు విఫలమైంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో మంత్రి మండలి రద్దయింది. దీంతో రఘువీరారెడ్డి, శైలజానాథ్ మాజీ మంత్రులయ్యారు. కాగా, కిరణ్ హయాంలో రఘువీరా, శైలజానాథ్‌లు జిల్లాకు చేకూర్చిన ప్రగతి కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా లబ్ధిపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
విభజన డ్రామాలో కిరణ్ ఒక ఎపిసోడ్
నంద్యాల, : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా రాష్ట్ర విభజన కోసం సోనియాగాంధీ ఆడించిన డ్రామాలో ఒక ఎపిసోడ్ అని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. విభజన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రిగా కిరణ్‌ను కొనసాగించడం ద్వారా అధిష్టానం లక్ష్యం నెరవేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో నాటకాన్ని ఆయన రక్తి కట్టించారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేత మోడీ సీమాంధ్రకు మద్దతు ప్రకటిస్తుండగా.. సుష్మాస్వరాజ్, అరున్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణకు మద్దతిస్తూ ద్వంద్వ నీతిని అవలంబించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే విభజన చేస్తామని లోక్‌సభలో బిల్లును బీజేపీ వ్యతిరేకించి ఉంటే ఆ పార్టీ విలువ రెట్టింపయ్యేదన్నారు. చంద్రబాబు సమైక్య లేఖ ఇవ్వకుండా సీమాంధ్రను మోసగించారన్నారు. బీజేపీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా విభజనకు మార్గం సుగమమం చేసిందన్నారు. ఇన్నివిధాల ద్రోహం చేసిన బాబుకు సీమాంధ్రలో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ డెరైక్షన్‌లో కిరణ్ సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూనే విభజనకు సహకరించారన్నారు. మీడియాలో ప్రకటనలు తప్పిస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరు సాగించారని.. విభజన వాదుల దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరారు. -
సీఎం హామీ గాలికే..
సీఎం హామీ గాలికే.. న్వాడ మండలం మందిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు * 50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వాగ్ధానం హామీలకే సరిపోయింది. ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించి 11 నెలలైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం నయా పైసా మంజూరు కాలేదు. దీంతో తమ గ్రామానికి నిధులు ఎప్పుడోస్తాయోనని గ్రామస్తులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. -, ధన్వాడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 మార్చి 12న వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, సమాచార శాఖమంత్రి డీకే అరుణ ధన్వాడ మండల పరిధిలోని మందిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామం నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా గ్రామ వీఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి తమ గ్రామానికి వస్తే గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రామంలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై ఆయన సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సహకరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు ప్రశాంతంగా జరగడానికి ఈ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సహకరించారని గ్రామాభివృద్ధి కోసం * 50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. గ్రామంలో వీఆర్వో కార్యాలయ నిర్మాణం కోసం నిధులు, ఎస్సీ, ఎస్టీలను ఆదుకునేందుకు ఇందిర జలప్రభ కింద సామూహిక బోర్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ముఖ్యమంత్రి గ్రాంట్ కింద మంజూరైన నిధులతో మందిపల్లి, మందిపల్లి పాతతండా, కొత్త తండాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. సీసీ రోడ్లు నిర్మించిన రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు, ఇళ్ల మధ్య నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. గ్రామంతో పాటు పాతతండా, కొత్తతండాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. చెరువు మరమ్మతు పనులు నిలిచిపోయాయి. హెల్త్ సబ్సెంటర్కు సొంత భవనం లేదు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభించేది. ధన్వాడ, మరికల్ గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ధన్వాడలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, మరికల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు *40 లక్షలు మంజూరు చేస్తామని, రెండో విడతలో మరికల్ బహిరంగ సభలో ప్రకటించారు. ధన్వాడలో ప్రధాన రహదారిని * 20 లక్షలతో సీసీ రోడ్డుగా మార్చారు. మరికల్‌కు * 40 లక్షలు మంజూరు కాగా వాటితో డ్రైనేజీల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కాని రాజకీయ విబేధాలకు నిలయంగా ఉండే మందిపల్లి గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సును విజయవంతం చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించే విషయంలో ఈ గ్రామంపై సీఎం సవతి తల్లి ప్రేమ చూపించారని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి మందిపల్లి గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన * 50 లక్షలను వెంటనే విడుదల చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
పక్షం రోజులైనా.. సాయం సున్నా
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎడతెరిపిలేని వర్షాలు వచ్చి జనం కడగండ్ల పాలై పక్షం రోజులు చూస్తూండగానే గడచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, చివరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే స్వయంగా జిల్లాకు వచ్చి వెళ్లినా కూడా బాధితులకు ఒరిగిందేమీ లేదు. వచ్చిన నాయకులంతా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లారే తప్ప ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. ఇళ్లు దెబ్బ తిన్నవారిని పట్టించుకోనేలేదు అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం జిల్లాలో 3 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా అమలాపురం రెవెన్యూ డివిజన్లో 806 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాస్తవానికి జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు ఐదారు వేలుంటాయని అంచనా. ఇళ్లు కూలిపోయి కొందరు, మంచాలు, వంటపాత్రలు.. ఇలా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినవారు మరికొందరు ఉన్నారు. ఇళ్లు కూలి రోడ్డున పడిన కుటుంబాలకు ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. దెబ్బ తిన్న ఇళ్ల వద్దకు వచ్చి అధికారులు పేర్లు నమోదు చేసుకుని పది రోజులు కావస్తోంది. మండల స్థాయిలో దెబ్బతిన్న ఇళ్ల లెక్క తేల్చినా పరిహారం ఊసే లేదు. కనీసం అధికారులు గుర్తించిన బాధితుల పునరావాసానికి కూడా ఏమీ ఇవ్వలేదు. జిల్లా కేంద్రం కాకినాడలోని పర్లోపేట, సంజయ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం నాటికి కూడా పరిహారం ఇవ్వలేదని ముంపు బాధితులు కొండబాబు, వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం మాటలు.. నీటిమూటలు ఇళ్లు దెబ్బ తిన్నవారికి దుస్తులు, వంటపాత్రల కోసం తక్షణ సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచినట్టు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు. మగ్గాల్లో నీరు చేరినవారికి రూ.5 వేలు, నూలు, ఇతర రసాయనాల విలువనుబట్టి మరో రూ.5 వేలు తక్షణం ఇస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గుప్పెడు బియ్యానికీ గతిలేదు ప్రజాపంపిణీ ద్వారా కేజీ బియ్యం కూడా ఇంతవరకూ ఇవ్వలేదు. పొయ్యి మీదకి అవసరమైన సరకుల సంగతి అలా ఉంచితే.. కనీసం పొయ్యి కిందకి కావలసిన కిరోసిన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. వర్ష బాధితుల కోసం జిల్లాలో లక్షా 56 లీటర్ల కిరోసిన్ విడుదల చేసినట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ, ఇంతవరకూ ఏ ఒక్క బాధిత కుటుంబానికి ఒక్క లీటరు కిరోసిన్ కూడా ఇవ్వలేదు. అన్నదాతకు భరోసా ఏదీ? జిల్లాలో వరి, పత్తి, అరటి, ఉల్లి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటలు అన్నీ కలిపి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట ముంపు బారిన పడి చేలల్లోనే కుళ్లిపోతుంటే.. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు బరువెక్కిన గుండెలతో బలవన్మరణాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు రైతులు మృతి చెందారు. తక్షణం ఆదుకొని.. వారిలో ధైర్యాన్ని నింపవలసని ప్రభుత్వం నుంచి అటువంటి స్పందనే లేదు. తాజాగా పంట నాశనమైందన్న మానసిక వేదనతో.. కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి శివారు పెదకలవల దొడ్డిలో కౌలు రైతు నురుకుర్తి సత్యనారాయణ (55) శనివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందాడు. కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన రైతు బుద్ధ శివ ఆదివారం ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. భారీ వర్షాలకు ఇతడికి చెందిన నాలుగు ఎకరాల చేను నాశనమైంది. అప్పులు తీర్చేలేని పరిస్థితుల్లో ఆత్మహత్యా యత్నం చేసుకుని, ఆస్పత్రిపాలయ్యాడు. జిల్లాలో రైతు దయనీయ పరిస్థితిని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. వరిలో అత్యధికంగా ఎకరాకు రూ.25 వేలు పైబడి పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన నీలం తుపాను బాధిత రైతులకే ఇంతవరకూ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈసారి వర్షాలవల్ల వాటిల్లిన నష్టానికి పరిహారం అందాలంటే మరో ఏడాది ఆగాల్సి వస్తుందని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది రైతులు సాయం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు తక్షణ సాయం అందించి, భరోసా ఇచ్చేవారని బాధితులు అంటున్నారు. -
పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి
సాక్షి, కడప: ‘సమైక్యాంధ్ర ఆవశ్యకతపై సీఎం బాగానే మాట్లాడాడు. సంతోషమే! అయితే మాటలు చేతల్లో చూపాలి. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఏ క్షణమైనా సీఎంని తొలగించవచ్చు. ఆలోపు ఆయన అసెంబ్లీని సమావేశపరచాలి. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలి. దానికి మేము మద్దతిస్తాం. అప్పుడు అన్నిపార్టీల రంగు బయటపడుతుంది. అన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘సమైక్య తీర్మానం’ చేస్తే ఆ నోట్‌ను సోనియాగాంధీకి పంపిద్దాం. అప్పుడు విభజన నిర్ణయం మారుతుంది. సమైక్యాశయం నెరవేరుతుంది.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య వేదిక’ పేరుతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ అన్ని జిల్లాల జేఏసీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులుగా తాము కొన్ని పరిమితులకు లోబడి, జీతాలు లేకున్నా 2నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఏపీఎన్జీవో, ఆర్టీసీ, విద్యుత్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వివరించారు. అయితే తాము ఎన్ని నిరసనలు చేసినా కేంద్రం చులకనగా చూస్తోందని, ఓ రాజకీయపార్టీ అండగా ఉంటే ఉద్యమానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలి: జేఏసీలు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారని, సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యం వహించి ఉద్యమాన్ని నడపాలని జేఏసీల నేతలు విన్నవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన శక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆ తర్వాత అలాంటి వ్యక్తి జగన్ మాత్రమే అని వారు స్పష్టం చేశారు. దీనిపై మైసూరా స్పందించారు. ‘‘తెలంగాణ ఉద్యమం రాజకీయ అండతో సాగింది. కానీ ఇక్కడ ఏ రాజకీయపార్టీ అండ లేకుండా గొప్ప ఉద్యమం నడుస్తోంది. జీతాలను పణంగా పెట్టి ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు. సమైక్య ప్రకటన వెలువడక ముందే మాపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. అయితే కొందరు నేతలు.. ముందుగా రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మీకు ముందే తెలుసు అంటూ అవివేకంగా మాట్లాడారు. విభజన నిర్ణయం వస్తోందని ప్రజలందరికీ తెలుసు. ఆ మాత్రం తెలీనివారు రాజకీయనేతలు ఎలా అయ్యారు? ప్రజల భవిష్యత్తుకు వీరేమి భరోసా ఇస్తారు? సమైక్యానికి అండగా విజయమ్మ దీక్ష చేశారు. జగన్ జైల్లోనే ఆమరణ దీక్ష చేశారు. దీనికి చాలా ఇబ్బందులు ఉంటాయి. గాంధీజీ తర్వాత జైల్లో దీక్ష చేసిన వ్యక్తి జగన్ మాత్రమే..’’ అని చెప్పారు. సమైక్యవాదాన్ని ముందుకు తీసుకెళతాం సమైక్య ఉద్యమానికి వైసీపీ అండగా ఉండి ముందుకు నడిపించాలని అందరూ కోరుతున్నారని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్‌సీపీదేనని మైసూరా హామీ ఇచ్చారు. తమతో పాటు సీపీఎం, ఎంఐఎం కూడా సమైక్యానికి అండగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నేతలు ఓ లేఖరాస్తే దానిపై మొదటి సంతకం జగన్‌తో పెట్టిస్తామని, అలాగే సీపీఎం, ఎంఐఎంతో పాటు చ ంద్రబాబు, బొత్స కూడా సంతకం చేసేలా జేఏసీ నేతలు ప్రయత్నించాలని సూచించారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమయ్యేలోపే ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. అప్పుడు ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతుంది, 60 రోజుల ఉద్యమ ఫలితం 6 గంటల్లోనే తేలిపోతుందని మైసూరా వివరించారు. ఉద్యమం బలోపేతానికి రైల్‌రోకోలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, సకలజనుల సమ్మె చేయాలని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచ రణను ఎలా రూపొందిస్తే అలా నడుచుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని మైసూరా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఏపీఎన్జీవోల సంఘం జిల్లా నేత గోపాల్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు రాంమూర్తినాయుడు, ఇతర జేఏసీల నేతలు పాల్గొన్నారు. -
సీఎంపై నేతల ఆగ్రహం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ :తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతుందనుకుంటున్న సమయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరుపై భగ్గుమన్నారు. రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే సీఎం రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి రెడ్యానాయక్ బహిరంగంగానే సీఎం వ్యాఖ్యలను ఖండించారు. ఇంతకాలం మౌనం వహించిన తెలంగాణ నేతలు కిరణ్‌పై క్రమంగా గొంతెత్తుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో నోరెత్తని ఈ నాయకులు.. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత నెమ్మదిగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు కలుగుతాయేమోననే ఆందోళనతో నాయకులు సీఎంపై విమర్శ దాడి పెంచుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు సైతం సీడబ్లూసీ తీర్మానానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అరుుతే గండ్ర, రాజయ్య మాత్రం తీవ్రంగా స్పందించారు. ‘అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని శాసనసభలో చెప్పిన సీఎం.. ఇప్పుడు మాటమార్చడంమేమిటి. అధిష్టాన నిర్ణయంతో సీఎం అయిన కిరణ్.. సీమాంధ్ర ప్రజల కోసం సీఎం పదవిని ఒదులుకుంటాననడం శోచనీయం’. అని శనివారం చీఫ్‌విప్ గండ్ర రమణారెడ్డి హన్మకొండలో అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం ఆకలి పోరాటమైతే, సీమాంధ్ర ఉద్యమం అజీర్తి ఉద్యమం. అసెంబ్లీలో తనచేతిలో ఏమీ లేదు.., అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమన్న సీఎం నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అర్దం కావడం లేదు’ అని ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ‘సీడబ్ల్యూసీ ద్వారా ప్రకటించిన తెలంగాణను సీఎం కిరణ్‌కుమార్ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఇది సరైందికాదు. ఆ పదవిలో ఉంటూ సీమాంధ్రకు మద్దతు తెలియజేస్తున్న సీఎం తన పదవికి రాజీనామా చేయాలి.’ అని కురవిలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సీఎం వ్యాఖ్యలపై నిరసనలు మరోవైపు కిరణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా న్యాయవాదులు, తెలంగాణవాదులు, టీఆర్ఎస్, జేఏసీ, టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. సీఎం వైఖరికి నిరసనగా హన్మకొండ కోర్టు ఎదుట న్యాయవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. హసన్‌పర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఘన్‌పూర్‌లో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సీఎం కిరణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా కరీమాబాద్, గోపాలస్వామిగుడి జంక్షణ్లో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. -
జిల్లా బంద్ సంపూర్ణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ పేరిట సీఎం కిరణ్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో జన జీవనం స్తంభించింది. ఈ సందర్భంగా తెలంగాణవాదులు కదం తొక్కారు. ఊరూరా సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పటాన్చెరు, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తెల్లవారుఝాము నుంచే టీజేఏసీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌ను విజయవంతం చేసేందుకు కదిలాయి. ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఏడు డిపోల పరిధిలో 570 బస్సులు నిలిచిపోయాయి. దుబ్బాక డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణవాదులతోపాటు బైఠాయించారు. జిల్లా మీదుగా నడిచే ఇతర రాష్ట్ర సర్వీసులు కూడా రద్దయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, ఆర్సీ పురంలో కూడా సిటీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 44వ నంబరు జాతీయ రహదారిపై మనోహరాబాద్, రామాయంపేట, 65వ నంబరు జాతీయ రహదారిపై ఇస్నాపూర్, రాజీవ్ రహదారిపై కొడకండ్ల, దుద్దెడలో రాస్తారోకో చేశారు. నాందేడ్ అకోలా రహదారిపై జోగిపేట, మాసాన్‌పల్లి, పెద్దశంకరంపేటలో తెలంగాణవాదులు బైఠాయించారు. మెదక్‌లో ఇద్దరు యువకులు టవర్ ఎక్కి సీఎం, డీఐజీని తప్పించాలంటూ నిరసన వ్యక్తం . పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం పారిశ్రామిక వాడల్లో యాజమాన్యాలు బంద్‌ను పాటించాయి. ర్యాలీలు, మానవహారాలు.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీజేఏసీ, టీఎన్జీఓస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీజేఏసీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్‌తోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాల సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని సిబ్బంది బహిష్కరించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సిబ్బంది రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మెదక్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సంయుక్తంగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. జహీరాబాద్‌లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్, గజ్వేల్, నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ వాదులు ర్యాలీలు నిర్వహించడంతోపాటు మానవహారాలు నిర్మించారు. బంద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొడుతున్న సీ ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా ఇచ్చిన బంద్ పిలుపునకు శనివారం అనూహ్య స్పందన లభించింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, న్యాయవాదులు, వ్యాపారులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్థంభించింది. వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు బంద్ పాటించాయి. ఈ సందర్బంగా జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వం, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. 24 గంటలు.. విశేష స్పందన.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన బంద్ కోసం తెలంగాణవాదులు అప్పుడే సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి వరకు కూడా ఆర్టీసీ బస్సులు బయటకు తీయలేదు. ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఉట్నూర్ డిపోల పరిధిలోని 588 బస్సులు ఎక్కడికక్కడే నిలిచాయి. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సమైక్యసభను నిరసిస్తూ బేల మండల కేంద్రంలో అంతరాష్ట్ర రహదారిపై జేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదుల ఫ్లెక్సీని దహనం చేశారు. సిర్సన్న గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మంచిర్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ నినాదాలు చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలుపుతూ సీఎంపై మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఊరూవాడా వెల్లువెత్తిన నిరసన.. శ్రీరాంపూర్, సీసీసీ ఏరియాలో జేఏసీ నాయకులు దగ్గరుండి బంద్ విజయవంతం చేయించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3, 3ఏ గనుల పై సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలను కార్మికులు దహనం చేశారు. లక్సెట్టిపేట, దండేపల్లి, మేదరిపేట, తాళ్లపేట గ్రామాల్లో టీఆర్ఎస్ , బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేశారు. ఆసిఫాబాద్ ఏరియాలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దుకాణాలు, బ్యాంకులు, పెట్రోలు బంక్‌లు, వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మను కార్మికులు తగలబెట్టారు. ఉట్నూర్‌లో టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఐటీడీఏ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు. జన్నారం మండలంలో మానవహారంగా ఏర్పడ్డారు. చెన్నూర్‌లోనూ బంద్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. భైంసా, ముథోల్, కుంటాల, కుభీర్, లోకేశ్వరం, తానూరు మండలాల్లోనూ బంద్ కొనసాగింది. కాగజ్‌నగర్‌లో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. -
4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం కిరణ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్న నేపధ్యంలో 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ముందుకు తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన పరిస్థితులలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితులను, సీమాంధ్ర ఉద్యమాల గురించి సీఎం ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నేడు మేడ్చల్‌కు సీఎం
మేడ్చల్/మేడ్చల్ రూరల్ న్యూస్‌లైన్: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం మేడ్చల్‌కు రానున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే కె.లకా్ష్మరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎం.వి.రెడ్డిలు పరిశీలించారు. 64వ వనమహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కండ్లకోయ ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వద్ద 20ఎకరాల్లో మొక్కలు నాటేందుకు సంకల్పించారు. సోమవారంనాటి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రెండురోజుల నుంచి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు.. వేదిక ఏర్పాటు, ఎక్కడెక్కడ మొక్కలు నాటాలి, అటవీశాఖ స్టాళ్లు, కార్యక్రమానికి విద్యార్థుల తరలింపు తదితర విషయాలపై అధికారులను ఆరా తీశారు. విద్యార్థులకు అందుబాటులో బిస్కెట్లు, మంచినీళ్లు ఉంచాలని.. వర్షం కురిస్తే తడవకుండా టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 1500మంది విద్యార్థులతో 4వేల మొక్కలు నాటించనున్నట్టు, వారిని తరలించడానికి తొమ్మిది బస్సులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. చురుకుగా ఏర్పాట్లు వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటవీ తదితర శాఖల అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటడానికి గుంతలను కూలీలను పెట్టి తవ్విస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగడానికి కండ్లకోయ జంక్షన్ సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యారావు, డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, డీఈఓ సోమిరెడ్డి, సైబరాబాద్ క్రైం డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌రావు, డీఎఫ్ఓ నాగభూషణం, తహసీల్దార్ భూపాల్‌రెడ్డి, ఎంపీడీఓ శోభ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సీఎం సమైక్యవాదినంటే సరిపోదు
ఒంగోలు , న్యూస్‌లైన్: సమైక్యవాదినని చెప్పుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన పదవికి, పార్టీకి రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని వైఎస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్ఆర్ ఎంతగానో తపించేవారన్నారు. అందులో భాగంగానే రెండో ఎస్సార్సీకి మొగ్గు చూపారని, ప్రత్యేక తెలంగాణ వైపు మాత్రం దృష్టి సారించలేదని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసమే పార్లమెంట్లో జగన్మోహన్రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తు చేశారు. తెలంగాణ రానుందని తెలియగానే తమ పార్టీ ఎమ్మెల్యేలం రాజీనామా చేశామని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులను అంటిపెట్టుకుని ఉన్నారని వ్యాఖ్యానించారు. జాతి ప్రయోజనాలకన్నా పదవులే ముఖ్యమనుకుంటున్న నాయకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని బాలినేని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉంటూ సమైక్యవాదినంటే జనం నమ్మే స్థితిలో లేరన్నారు. విధి నిర్వహణ వరకు అంకితమైతే సహిస్తామని, ఉద్యమాన్ని అణిచివేయాలని యత్నిస్తే మాత్రం ‘డీఎం...గో బ్యాక్’ అంటూ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను హెచ్చరించారు. ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు బషీర్ మాట్లాడుతూ సకల జనుల సమ్మె విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికులది ముఖ్యపాత్రన్నారు. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం చర్యలు చేపడితే ఉద్యోగ సంఘాల జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరికీ వ్యతిరేకంగా ఉద్యోగులు సమర శంఖారావం పూరిస్తామని హెచ్చరించారు. మరో నాయకుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఎన్జీఓస్ మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి ఖండిం చారు. తాము కేవలం సమైక్యాంధ్రను మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజధాని లాంటి సమస్యలను వేదికపైకి తీసుకురావొద్దంటూ సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ నాయకులు కేఎన్ రావు, వాకా రమేష్‌బాబు, తదితరులు మాట్లాడారు. హైలైట్‌గా నిలిచిన వంటావార్పు స్థానిక ఆర్టీసీ డిపోలో కార్మికుడు జీవీఆర్ రెడ్డి చేపట్టిన వంటావార్పు కార్యక్రమం సకల జనుల సమ్మెలో హైలైట్‌గా నిలిచింది. బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచే కళాకారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఇదే సమయంలో ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన కార్మికులు ఆర్టీసీ ఔట్ గేటు వద్ద మానవహారం నిర్వహించారు. టైర్లను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ గ్యారేజీ వద్దకు చేరుకొని బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. అధికారులు బలవంతంగా కొన్ని బస్సులను తిప్పేందుకు సిద్ధమయ్యారు. బస్సులకు గాలి తీసేందుకు కార్మికులు యత్నించడంతో సర్వీసులు నిలుపుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వంటావార్పులో బాలినేని స్వయంగా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లబ్యాడ్జిలతో జూనియర్ అధ్యాపకుల నిరసన ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల అధ్యాపకులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు. ఏన్జీఓల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగనాయకులు, వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 18న సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమై ఎన్జీఎలతో పాటు సమ్మెలో పాల్గొనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను పీడీఎస్‌యూ, పీవైఎల్ కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఖమ్మం బైపాస్ రోడ్డులో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.రాజా, పీవైఎల్ ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు ఎస్కె.లాల్మియా మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, సీమాంధ్రులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ నుంచి అనుకూల ప్రకటన రాగానే... రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఆయా పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం తెలంగాణ విద్యార్థి, యువతపై ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో తమ ఆస్తులను, పెత్తనాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులు ఎన్.చంటి, ప్రవీణ్, సాయిబాబా, సంజయ్, జగన్, కుమార్, వెంకటేష్, వాసు, చందు, నాగేశ్వరరావు, పాపారావు, బాబు తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో... బయ్యారం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన దిష్టిబొమ్మను న్యూడెమోక్రసీ కార్యకర్తలు, నాయకులు ఆదివారం బయ్యారంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తుడుం వీరభద్రం, రామగిరి బిక్షం మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులకు సీఎం వత్తాసు పలుకుతూ, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, తిరుమలేష్, కృష్ణ,అర్జున్,రమేష్ పాల్గొన్నారు. -
13న ఢిల్లీకి సీఎం కిరణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 13న ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ఆరోజు ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం బొత్స ఢిల్లీలోనే ఉన్నారు. ఈనెల 13న ఇరువురు నేతలు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో ఏకే ఆంటోని కమిటీతో సమావేశమై సీమాంధ్రలో తలెత్తిన పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌లతో సమావేశమైన తరువాతే ఆంటోని కమిటీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర నేతలు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను ముందే తెలుసుకోవడంతోపాటు వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకే వీరిద్దరితో ఆంటోనీ కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. అపాయింట్మెంట్ లభిస్తే సోనియాగాంధీని కూడా కలిసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒకరోజు ముందే అంటే 12న ఢిల్లీకి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. 13న రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధర్నా అనంతరం వీరంతా సీఎం, పీసీసీ చీఫ్‌లతో కలిసి హైకమాండ్ పెద్దల వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళీమోహన్, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు శనివారం సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఢిల్లీ యాత్రపై నిర్ణయానికి రావడంతో పాటు ఆ సమాచారాన్ని ఇతర నేతలకు చేరవేశారు. 12న సాయంత్రానికే అంతా ఢిల్లీ చేరుకోవాలని చెప్పారు. గంటా, ఏరాసు, విశ్వరూప్ శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. -
తెలంగాణపై వెనక్కుతగ్గేదిలేదు:దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో టిడిపి వెనక్కి తగ్గినా, కాంగ్రెస్ వెనక్కి తగ్గదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2004లో పార్టీ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ అంశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. రాయలసీమ-ఆంధ్ర ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవిస్తామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆంటోనీ కమిటీకి అన్ని విషయాలు విన్నవించుకోవచ్చని తెలిపారు. ఆంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ కాదని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు సమ్మె విరమించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడిన తరువాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తాను చూశానని, విభజన తరువాత తలెత్తే అంశాలనే ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. సీఎంపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. తాను కూడా సిఎంతో మాట్లాడినట్లు చెప్పారు. సిఎం చెప్పిన వివరణతో సంతృప్తి చెందినట్లు తెలపిఆరు. -
కిరణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: కేసీఆర్
రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కిరణ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. చరిత్రను వక్రీకరించి సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మాటల్లో అర్థం లేదని కొట్టిపారేశారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు ఈ ప్రాంతం బిడ్డలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కిరణ్‌కు ఇష్టముంటే ఇక్కడే ఉండొచ్చని సూచించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు సీఎంకు లేదన్నారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై సీఎం చెప్పిన లెక్కలన్నీ తప్పని కేసీఆర్ అన్నారు. సీఎం చెప్పిన లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్ధమన్నారు. కిరణ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరెంట్ కొరతను చూపి తెలంగాణ వాసులను సీఎం కిరణ్ భయపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తమ ప్రాంతానికి 6800 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు. లోటును పూడ్చుకునేందుకు కేంద్రం 1000 మెగావాట్ల విద్యుత్ తీసుకుంటామన్నారు. ఛత్తీస్‌గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ఎదుగుతామని కేసీఆర్ చెప్పారు. హైకోర్టు విషయంలో సీఎం కిరణ్ మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు. 1919లోనే తెలంగాణలో హైకోర్టు ఏర్పడిందని, 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆంధ్ర అడ్వకేట్లు 5 శాతం మందే ఉన్నారని వెల్లడించారు. -
స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజన: సీఎం కిరణ్
రాష్ట్ర విభజనపై అభ్యంతరాలుంటే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయికి చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏకే ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌కు ఆహ్వానించి అభ్యంతరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత తొలిసారిగా సీఎం కిరణ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సమ్మెకు దిగొద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాల కూల్చివేతను సీఎం ఖండించారు. రాజకీయ లబ్ది కోసమే విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన వైఖరి అవలంభిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా, కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటనను వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదన్నారు. పార్టీ వరకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. విభజన నిర్ణయం ఇంకా కాంగ్రెస్ పార్టీ వద్దే ఉందన్నారు. రాష్ట్ర విభజనపై మిగతా పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సీపీఎం, ఎంఐఎం మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయని వెల్లడించారు. విభజిస్తే జలవివాదాలు పెరుగుతాయన్నారు. ఉద్యమాల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుందని అన్ని అంశాలను చర్చించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు. -
కిరణ్, బొత్స పథకం ప్రకారమే ఉద్యమం: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల పథకం ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు విమర్శించారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వారు పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణకే కట్టుబడి ఉన్నారని వారు స్సష్టం చేశారు. సీమాంధ్రుల హక్కుల కోసమే తమ పార్టీ నేతల రాజీనామాలు చేశారని వివరణ ఇచ్చారు. రెచ్చగొట్టే ధోరణి సరికాదని, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని వారు హితవు పలికారు.