మేడ్చల్/మేడ్చల్ రూరల్ న్యూస్‌లైన్: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం మేడ్చల్‌కు రానున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే కె.లకా్ష్మరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎం.వి.రెడ్డిలు పరిశీలించారు. 64వ వనమహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కండ్లకోయ ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వద్ద 20ఎకరాల్లో మొక్కలు నాటేందుకు సంకల్పించారు. సోమవారంనాటి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రెండురోజుల నుంచి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు.. వేదిక ఏర్పాటు, ఎక్కడెక్కడ మొక్కలు నాటాలి, అటవీశాఖ స్టాళ్లు, కార్యక్రమానికి విద్యార్థుల తరలింపు తదితర విషయాలపై అధికారులను ఆరా తీశారు. విద్యార్థులకు అందుబాటులో బిస్కెట్లు, మంచినీళ్లు ఉంచాలని.. వర్షం కురిస్తే తడవకుండా టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 1500మంది విద్యార్థులతో 4వేల మొక్కలు నాటించనున్నట్టు, వారిని తరలించడానికి తొమ్మిది బస్సులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
చురుకుగా ఏర్పాట్లు
వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటవీ తదితర శాఖల అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటడానికి గుంతలను కూలీలను పెట్టి తవ్విస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగడానికి కండ్లకోయ జంక్షన్ సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యారావు, డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్, డీఈఓ సోమిరెడ్డి, సైబరాబాద్ క్రైం డీసీపీ రంగారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌రావు, డీఎఫ్‌ఓ నాగభూషణం, తహసీల్దార్ భూపాల్‌రెడ్డి, ఎంపీడీఓ శోభ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నేడు మేడ్చల్‌కు సీఎం
Published Mon, Aug 19 2013 2:46 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement