హైదరాబాద్: సమైక్యవాద ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇరిగేషన్ అధికారులు కూడా సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే ఉధృతమైన ఈ ప్రజా ఉద్యమంలో ఎన్జీఓలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో ఈ అర్ధరాత్రి నుంచి ఇరిగేషన్ అధికారుల సమ్మె చేయనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్లకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చినట్లు రాయలసీమ జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు చెప్పారు.