
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్ర్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరు తిరుమల దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు.. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో మొత్తం 11 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment