సాక్షి, చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఏడేళ్ల బాలుడు కరీముల్లాను స్వయానా అతని పిన్ని ఆషా దారుణంగా కత్తితో కోసి హతమార్చిన సంఘటన తెలిసిందే. సంఘటన జరిగి 36 గంటలు గడిచినా నిందితురాలు ఆషా ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు ప్రాథమికంగా ఆమె మానసిక పరిస్థితికి సంబంధించి కొన్ని పరీక్షలను నిర్వహించారు. (దారుణం: రక్తం రుచిచూస్తూ.. పేగులు మెడలో)
ఆయా పరీక్షల ఆధారంగా ఆషాకు నరాలకు సంబంధించిన కొన్ని బలహీనతలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి పెరిగి విచక్షణ కోల్పోయిందని, ఆ సమయంలోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాలను సోమవారం చిలకలూరిపేట కోర్టులో న్యాయమూర్తికి పోలీసులు నివేదించారు. వివరాలను పరిశీలించి ఆషాను వైజాగ్‌లోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించి మరిన్ని పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను సోమవారం రాత్రి పోలీసులు వైద్యుల సాయంతో వైజాగ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment