mental care hospital
-
బాలుడిని చంపిన పిన్ని విశాఖ ఆస్పత్రికి..
సాక్షి, చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం ఏడేళ్ల బాలుడు కరీముల్లాను స్వయానా అతని పిన్ని ఆషా దారుణంగా కత్తితో కోసి హతమార్చిన సంఘటన తెలిసిందే. సంఘటన జరిగి 36 గంటలు గడిచినా నిందితురాలు ఆషా ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు ప్రాథమికంగా ఆమె మానసిక పరిస్థితికి సంబంధించి కొన్ని పరీక్షలను నిర్వహించారు. (దారుణం: రక్తం రుచిచూస్తూ.. పేగులు మెడలో) ఆయా పరీక్షల ఆధారంగా ఆషాకు నరాలకు సంబంధించిన కొన్ని బలహీనతలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి పెరిగి విచక్షణ కోల్పోయిందని, ఆ సమయంలోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాలను సోమవారం చిలకలూరిపేట కోర్టులో న్యాయమూర్తికి పోలీసులు నివేదించారు. వివరాలను పరిశీలించి ఆషాను వైజాగ్‌లోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించి మరిన్ని పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను సోమవారం రాత్రి పోలీసులు వైద్యుల సాయంతో వైజాగ్‌కు తరలించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించనున్న పీఏసీ
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని మానసిక రోగుల ఆసుపత్రిని ఆగస్టు 5వ తేదీన సందర్శించాలని ప్రభుత్వ పద్దుల కమిటీ (పిఎసి) నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాలులో పిఎసి చైర్మన్ పి.కిష్టారెడ్డి అధ్యక్ష్యతన బుధ వారం సమావేశం జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖైదీల కోసం నిర్మిస్తున్న ప్రత్యేక వార్డు పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఈ వార్డు పనులు 2006లో మొదలయ్యాయి. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై అధికారులను వివరాలు కోరింది. సరిపడా నిధులు లేని కారణంగానే వార్డు నిర్మాణం పూర్తి కాలేదని అధికారులు ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులు విడుదల చేసిన విషయాన్ని అధికారులకు పిఎసి గుర్తు చేసింది. అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదని కమిటీ గుర్తించింది. దీంతో వచ్చే నెల 5వ తేదీన ఎర్రగ డ్డ ఆసుపత్రిని సంద ర్శించాలని, ఖైదీల ప్రత్యేక వార్డును పనులను పరిశీలించాలని పిఎసి నిర్ణయించింది.