
దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో ఓ దినపత్రిక విలేకరి శంకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దాడి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.