shanker
-
‘గేమ్ ఛేంజర్’ ఆడియో లీక్‌పై దిల్ రాజు ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి గరగండి’అనే పాట ఆన్లైన్ వేదికగా లీకైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాంగ్ లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పాటను లీకు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్ట విరుద్ధంగా నాసిరకం కంటెంట్ ను వ్యాప్తి చేయొద్దు కోరాడు. వందల కోట్ల బడ్జెట్.. ఇలా అయితే ఎలా? ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్ వందల కోట్లు దాటుతుంది. పాన్ ఇండియా సినిమా అయితే కచ్చితంగా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే. గేమ్ ఛేంజర్ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి కేవలం ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదు. అంతలోనే ఈ పాట లీకైంది. ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోట్లల్లో ఖర్చు పెట్టి తీసే సినిమాలను ఇలా లీకులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.15 కోట్ల పాట ఇదేనా? డైరెక్టర్ శంకర్ తన సినిమాల్లోని పాటలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. కేవలం పాటలకే కోట్లల్లో ఖర్చు చేస్తుంటాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా రూ. 15 కోట్లతో ఓ పాటను చిత్రీకరించారని ఆ మధ్య ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అయింది. ఆ పాట చాలా వైవిధ్యంగా ఉంటుందని, గ్రాఫిక్స్, లొకేషన్స్ అదిరిపోతాయని అన్నారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఆ పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇంతలోనే ఓ పాట లీకై చిత్ర యూనిట్‌కి భారీ షాక్ తగిలింది. రూ. 15 కోట్ల ఖర్చుతో షూట్ చేసిన పాట ఇదేనని నెట్టింట టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో చిత్ర యూనిట్ స్పందిస్తే కానీ తెలియదు. A criminal case has been filed under IPC 66(C) against the people who leaked the contents of our film #GameChanger. We request you to refrain from spreading the inferior quality content which has been illegally leaked. pic.twitter.com/pDdgtYwQx5 — Sri Venkateswara Creations (@SVC_official) September 16, 2023 -
సినిమాల వర్షం కురిపించడానికి సిద్దమైన అగ్రదర్శకులు
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఎన్నో సినిమాలను అందించిన దర్శకులు మణిరత్నం, శంకర్ ఇప్పుడు సినిమా వర్షం కురిపించడానికి రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ కొందరు అగ్రదర్శకులతో కలిసి ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆరంభించారు. థియేటర్, ఓటీటీ.. ఇలా పలు ప్లాట్‌ఫామ్‌లకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించాలన్నదీ, కొత్త మేకర్స్‌కి అవకాశం ఇవ్వాలన్నదే ఈ నిర్మాణ సంస్థ సంకల్పం. (చదవండి: డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన) ఈ బేనర్లో మణిరత్నం, శంకర్‌తో పాటు భాగస్వాములైనవారిలో ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంతబాలన్, లోకేశ్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్ ఉన్నారు. తొలి ప్రాజెక్ట్‌కి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘విక్రమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్. ఇది పూర్తయ్యాక ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ బేనర్లో చేసే సినిమాని ఆరంభిస్తారు. ఇంకా నటీనటులను ఖరారు చేయలేదు. ఇలా అగ్రదర్శకులు కలిసి ఓ నిర్మాణ సంస్థను ఆరంభించడం మంచి విషయమని కోలీవుడ్ అంటోంది. -
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్స్, అదే అందరి టార్గెట్
భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాపై దృష్టి పెట్టారు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ మార్కెట్ మీదనే కన్నేశారు. గతంలో మాదిరి ఒక భాషకి పరిమితం కాకుండా... రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలనేదే అందరి టార్గెట్. అందుకే పాన్ ఇండియా లెవెల్లో కొత్త కాంబినేషన్స్‌కు ట్రెండ్ ఊపందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దలపతి విజయ్ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 6 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇక మరో తమిళ స్టార్ ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయునున్నాట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా నెక్ట్ జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది అని టాక్. అంతే కాకుండా ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చరణ్ 15 వ సినిమాగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు . సుమారు 500 కోట్ల తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ద్వారా ఇండియన్ పొలిటికల్ సిప్టమ్ మీద స్ట్రాంగ్ సెటైర్స్ వేయనున్నారట శంకర్. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా మూవీలో అమితా బచ్చన్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు . కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మెదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండు షెడ్యూల్ లోకి కూడా అడుగుపెట్టారు చిత్ర యూనిట్. సుమారు 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి . దీంతో పాటు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్. రామ్‌తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యనే సినిమా స్టార్ట్ చేసారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా మురగాదాస్ దర్శకత్వంలో గజనీ 2 సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య కోసం బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ ధ్రిల్లర్‌ను రెడీ చేసాడట. శివకార్తికేయన్ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథలు సిద్ధం చేశారు అని తెలుస్తుంది . 'రాక్షసుడు-2' చిత్రం కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ కూడా ప్రచారం సాగుతోంది. -
‘ఇండియన్ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ఇండియన్ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్‌పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్-2’ షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్‌పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
సైకో కిల్లర్ ఆటో శంకర్ ఆత్మహత్య
-
రజనీ అభిమానులకు శంకర్ అదిరిపోయే న్యూస్
సాక్షి, చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పెద్ద పండుగ. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరింత ఉత్సాహాన్నిచ్చే విషయం స్వయంగా శంకర్ వెల్లడించారు. ఈ సినిమాను 3డీలో కూడా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో అందుకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. కావాలని తాము 3డీని ఉపయోగించలేదని, స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే 3డీ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. యాక్షన్ మధ్యలో 3డీ వస్తుందని, సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో సినిమా 2డీలో తీసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు 3డీలోకి కన్వర్ట్ చేసుకుంటారని కానీ తాము మాత్రం లేటెస్ట్ 3డీ కెమెరాతో డైరెక్ట్‌గా నేచురల్‌గా తీశామని, ప్రతిసీన్ను హైటెక్ 3డీ గ్లాస్‌తో మానిటర్‌పై చెక్ చేసుకున్నామని తెలిపారు. ఈ సినిమా తర్వాత చాలా ధియేటర్లు 3డీ కన్వర్షన్ చేసుకుంటాయని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ వీడియోలోనే రజనీకాంత్ కూడా మాట్లాడుతూ ఫస్ట్ 3డీ షాట్ తాను పదే పదే చూసుకొని మిస్మరైజ్ అయ్యానని, తాను శంకర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. ఏ హాలీవుడ్ మూవీకి తగ్గనట్లు ఈ చిత్రం ఉండబోతుందన్నారు. -
రజనీ అభిమానులకు శంకర్ అదిరిపోయే న్యూస్
-
‘శంకర్-కమల్-దిల్ రాజు’ కాంబో మూవీకి సైన్
సాక్షి: ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న భారతీయుడు సీక్వెల్‌పై గుడ్ న్యూస్ అందింది. కొత్త సాంకేతిక విలువలతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భారతీయుడు మూవీకి 20ఏళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్, విలక్షణ దర్శకుడు శంకర్, టాప్ తెలుగు ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్లో భారతీయుడు-2 తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు-2 మూవీ కోసం కమల్.. డైరెక్టర్ శంకర్‌తో సంతకం చేశారు. నిజ జీవితంలో తమిళనాడులోని ప్రభుత్వంలో అవినీతి అధికారులపై విమర్శలు గుప్పిస్తున్న కమల్ రీల్ లైఫ్‌లో కూడా ఇదే సమస్యను హైలైట్ చేయనున్నారట. దీంతో ఇటు రాజకీయ రంగ ప్రవేశంపై హింట్స్ మీద హింట్స్ ఇస్తున్న కమల్, అటు రాజకీయాలంటే తనకూ చాలా ఇష్టమని ఇటీవల దిల్‌రాజు ప్రకటించిన నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉండనున్నాయి. ప్రతీ సినిమాలో విలక్షణ పాత్రలతో ఆ కట్టుకునే కమల్‌తో తనదైన వైవిధ్యంతో ప్రేక్షకులకు చూపించే శంకర్ రూపొందించే సినిమా భారతీయుడు మించి ఉంటుందనీ, కమల్-దిల్‌రాజు-శంకర్ కాంబినేషన్లో ఖచ్చితంగా ఇది పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుందని సినీ పండితులు భావిస్తున్నారు. కాగా 1996 లో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు మూవీ భారత సినీ చరిత్రలో తనదైన రికార్డును కొల్లగొట్టింది. సమాజంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతూ, అవినీతిపై పోరు నేపథ్యంలో శంకర్ తీసిన భారతీయుడు ఎవర్గ్రీన్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
సాక్షి కార్టూనిస్టుకు అవార్డు
హైదరాబాద్: సాక్షి ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ నెల 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును శంకర్ అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కలుసుకున్నారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. శంకర్‌కు ఈ అవార్డు రావడం పత్రికా రంగానికి గర్వకారణం అన్నారు. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు గ్రాండ్ ప్రీ అవార్డును ప్రకటిస్తుంది. ఓ రకంగా దీనిని పత్రికా రంగంలో నోబెల్ అవార్డుగా భావిస్తారు. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కూడా. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు. నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ సాక్షి దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో నాలుగుసార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. -
దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి
-
దుండగుల దాడిలో గాయపడ్డ పత్రికా విలేకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో ఓ దినపత్రిక విలేకరి శంకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దాడి ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.