
సాక్షి: ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న భారతీయుడు సీక్వెల్‌పై గుడ్ న్యూస్ అందింది. కొత్త సాంకేతిక విలువలతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భారతీయుడు మూవీకి 20ఏళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్, విలక్షణ దర్శకుడు శంకర్, టాప్ తెలుగు ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో భారతీయుడు-2 తెరకెక‍్కనుంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు-2 మూవీ కోసం కమల్.. డైరెక్టర్ శంకర్‌తో సంతకం చేశారు.
నిజ జీవితంలో తమిళనాడులోని ప్రభుత్వంలో అవినీతి అధికారులపై విమర్శలు గుప్పిస్తున్న కమల్ రీల్ లైఫ్‌లో కూడా ఇదే సమస‍్యను హైలైట్ చేయనున్నారట. దీంతో ఇటు రాజకీయ రంగ ప్రవేశంపై హింట్స్ మీద హింట్స్ ఇస్తున్న కమల్, అటు రాజకీయాలంటే తనకూ చాలా ఇష్టమని ఇటీవల దిల్‌రాజు ప్రకటించిన నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉండనున్నాయి.
ప్రతీ సినిమాలో విలక్షణ పాత్రలతో ఆ కట్టుకునే కమల్‌తో తనదైన వైవిధ్యంతో ప్రేక్షకులకు చూపించే శంకర్ రూపొందించే సినిమా భారతీయుడు మించి ఉంటుందనీ, కమల్-దిల్‌రాజు-శంకర్ కాంబినేషన్‌లో ఖచ్చితంగా ఇది పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుందని సినీ పండితులు భావిస్తున్నారు.
కాగా 1996 లో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు మూవీ భారత సినీ చరిత్రలో తనదైన రికార్డును కొల్లగొట్టింది. సమాజంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతూ, అవినీతిపై పోరు నేపథ్యంలో శంకర్ తీసిన భారతీయుడు ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.