దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పెద్ద పండుగ. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరింత ఉత్సాహాన్నిచ్చే విషయం స్వయంగా శంకర్ వెల్లడించారు. ఈ సినిమాను 3డీలో కూడా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో అందుకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. కావాలని తాము 3డీని ఉపయోగించలేదని, స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే 3డీ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు.