
3డీ షాట్‌ను మానిటర్‌పై 3డీ కళ్లద్దాలతో వీక్షిస్తున్న రజనీకాంత్, డైరెక్టర్ శంకర్
సాక్షి, చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పెద్ద పండుగ. ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరింత ఉత్సాహాన్నిచ్చే విషయం స్వయంగా శంకర్ వెల్లడించారు. ఈ సినిమాను 3డీలో కూడా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో అందుకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. కావాలని తాము 3డీని ఉపయోగించలేదని, స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే 3డీ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు.
యాక్షన్ మధ్యలో 3డీ వస్తుందని, సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో సినిమా 2డీలో తీసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు 3డీలోకి కన్వర్ట్ చేసుకుంటారని కానీ తాము మాత్రం లేటెస్ట్ 3డీ కెమెరాతో డైరెక్ట్‌గా నేచురల్‌గా తీశామని, ప్రతిసీన్‌ను హైటెక్ 3డీ గ్లాస్‌తో మానిటర్‌పై చెక్ చేసుకున్నామని తెలిపారు. ఈ సినిమా తర్వాత చాలా ధియేటర్లు 3డీ కన్వర్షన్ చేసుకుంటాయని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ వీడియోలోనే రజనీకాంత్ కూడా మాట్లాడుతూ ఫస్ట్ 3డీ షాట్ తాను పదే పదే చూసుకొని మిస్మరైజ్ అయ్యానని, తాను శంకర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. ఏ హాలీవుడ్ మూవీకి తగ్గనట్లు ఈ చిత్రం ఉండబోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment