రాఘవ లారెన్స్, ప్రియా భవానీ జంటగా నటిస్తున్న చిత్రం 'రుద్రన్'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన లారెన్స్ పిక్ వైరల్‌గా మారింది. అచ్చం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను తలపిస్తోంది. తలైవాను మరిపిస్తున్న రాఘవ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్‌తో లారెన్స్ అదరగొడుతున్నారు. మొదట క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు.. తాజాగా ఈనెల 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
(చదవండి: కడసారి చూపునకు నోచుకోలేకపోయా: రాఘవ లారెన్స్ ఎమోషనల్)
కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment