
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ 12వ జాబితా విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ మంగళవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది.
ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమించారు.