చిలకలూరిపేట: విజయాన్ని జగనన్నకు కానుక ఇస్తాం.. | YSRCP Leader Vidadala Rajani Fires on Prathipati Pulla Rao | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట: విజయాన్ని జగనన్నకు కానుక ఇస్తాం..

Published Sun, Mar 24 2019 3:36 PM | Last Updated on Sun, Mar 24 2019 4:01 PM

 YSRCP Leader Vidadala Rajani Fires on Prathipati Pulla Rao - Sakshi

సాక్షి, చిలకలూరిపేట: మంత్రి ప్రతిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విడదల రజినీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విడుదల రజనీ ప్రసంగిస్తూ మంత్రి పుల్లారావు, ఆయన సతీమణి నియోజకవర్గంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఇలాంటి నాయకులు తమకు అవసరం లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని కేబుల్‌ నెట్‌వర్క్‌ను కూడా నిలిపివేశారని ఆమె మండిపడ్డారు. జననేత వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి చిలకలూరిపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చిలకలూరిపేటలో విజయం సాధించి జగనన్నకు కానుకగా ఇస్తామని ఆమె అన్నారు. చిలకలూరిపేటలో ఒక బీసీ మహిళ అయిన తనకు అవకాశం కల్పించినందుకు ఆమె వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా చిలకలూరిపేట జనసంద్రమైంది. రహదారులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement