
మెమొంటో, సర్టిఫికెట్‌తో ఫజీలాతబస్సుమ్
తొమ్మిదేళ్ల వయస్సులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలాతబస్సుమ్ స్థానం సాధించింది. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను 1.43 నిమిషాల్లో అమర్చి రికార్డు నెలకొల్పింది.
నాదెండ్ల (చిలకలూరిపేట): తొమ్మిదేళ్ల వయస్సులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట చిన్నారి ఫజీలాతబస్సుమ్ స్థానం సాధించింది. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను 1.43 నిమిషాల్లో అమర్చి రికార్డు నెలకొల్పింది. గతంలో పాకిస్తాన్‌కు చెందిన చిన్నారి 2.27 నిమిషాల్లో ఈ ఘనత సాధించగా, దానిని ఫజీలాతబస్సుమ్ బ్రేక్ చేసింది. చిలకలూరిపేటలోని సుభానీనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ రహీమ్ కుమార్తె షేక్ ఫజీలాతబస్సుమ్ తన తండ్రి పాఠశాలలోనే ఐదో తరగతి చదువుతోంది.
కాగా, గతంలో ఫజీలా 118 మూలకాలను ఒక నిమిషం 57 సెకన్లలోనే అమర్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సాధించింది. ఈ ఏడాది జనవరిలో గణపవరం సీఆర్ కళాశాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు అఫీషియల్ అటెమ్ట్ నిర్వహించగా 1.43 నిమిషాల్లో ఈవెంట్‌ను పూర్తి చేసింది. ఏప్రిల్ 27న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారికంగా సమాచారం, సర్టిఫికెట్ అందుకుంది. ప్రస్తుతం 1.30 నిమిషాల్లోనే ఆవర్తన ప్రక్రియ అమర్చి తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్
అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో