ఓవరాల్ చాంపియన్ చిలకలూరిపేట
ఓవరాల్ చాంపియన్ చిలకలూరిపేట
Published Thu, Dec 1 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
గుంటూరు స్పోర్ట్స్‌ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీల్లో చిలకలూరిపేటకు చెందిన అథ్లెటిక్స్ బాలికల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలను గురువారం స్థానిక బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రారంభించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాలలో జరిగిన పోటీలలో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చి రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. డీఎస్‌డీవో బీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్ స్టేడియంలో ఈనెల 3వ తేదీన బాక్సింగ్, ఖోఖో, 5వ తేదీన కబడ్డీ, హాకీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. 7వ తేదీన నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఫుట్‌బాల్, వాలీబాల్, తైక్వాండో పోటీలు జరుగుతాయన్నారు.
విజేతలు వీరే..
జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల జాబితాను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ప్రకటించారు. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వంద మీటర్ల పరుగులో ధన్‌రాజ్ (బాపట్ల), కె.ఉమేష్ (గుంటూరు తూర్పు) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 400మీటర్ల పరుగులో బి.పవన్‌కుమార్(చిలకలూరిపేట), సి.హెచ్.గోపి (వినుకొండ), లాంగ్‌జంప్‌లో కె.గోపివర్మ (బాపట్ల), బి.రాము (రేపల్లె), షాట్‌పుట్‌లో పృథ్విరాజ్ (వేమూరు), సైదు మస్తాన్‌వలి(వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో కె.సీతమ్మ (పొన్నూరు), ఆర్.అంజలి (మాచర్ల), 400 మీటర్ల పరుగులో బీబీ ఫాతిమా (గుంటూరు తూర్పు), ఎ.నిఖిత (రేపల్లె), లాంగ్‌జంప్‌లో డి.శ్రావణి (గుంటూరు పశ్చిమ), ఎ.సాయిదుర్గ (బాపట్ల), షాట్‌పుట్‌లో బి.మానస (గుంటూరు పశ్చిమ), ఎల్.పూజ (వేమూరు), అండర్–17 బాలుర విభాగంలో వంద మీటర్ల పరుగులో జి.హర్షవర్ధన్ (గుంటూరు తూర్పు), ఆర్.సాంబిరెడ్డి (సత్తెనపల్లి), 400 మీటర్ల పరుగులో బి.శ్యామేల్ (బాపట్ల), షేక్ రసూల్ (నరసరావుపేట), లాంగ్‌జంప్‌లో ఎ.కోటేశ్వరరావు (గుంటూరు తూర్పు), జె.రమేష్ (గుంటూరు తూర్పు), ఎ.సాంబిరెడ్డి (చిలకలూరిపేట), వీరాంజనేయులు (వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో బి.జ్యోతి (చిలకలూరిపేట), బి.రాజ్యలక్ష్మి (వేమూరు), 400 మీటర్ల పరుగులో జె.రాణి (ప్రత్తిపాడు), డి.లహరి (రేపల్లె), లాంగ్‌జంప్‌లో ఎన్.సౌజన్య (చిలకలూరిపేట), కె.సుప్రియ (వినుకొండ), షాట్‌పుట్ విభాగంలో కె.శాంతకుమారి (నరసరావుపేట), ఎం.నాగభార్గవి (పొన్నూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎమ్మెల్సీ రామకృష్ణ ట్రోఫీ అందజేశారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement