గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంవీఎన్ శంకర్ (53) హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు కోరారు.
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంవీఎన్ శంకర్ (53) హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు కోరారు. మంగళవారం జిల్లా ఎస్పీని ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
రిపోర్టింగ్ పూర్తి చేసుకుని రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటుండగా ముగ్గురు ఆగంతకులు దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రికి తరలించగానే శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై వార్తలు రాసినందుకే మాఫియా గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొన్నారు.
శంకర్ (53) హత్యను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే), ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీఎన్‌ఈఎఫ్), ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించాయి.