
చిలకలూరిపేటటౌన్: తమకు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్ష ణ కల్పించాలని ఓ ప్రేమజంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన అన్నలదాసు మణికంఠ గురజాలలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు. అదే గ్రామానికి చెందిన చలవాది సాయినందినితో ఇంటర్మీడియట్ నుంచి స్నేహం ఉంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తమ పెళ్లికి బంధువులు అంగీకరించరనే ఉద్దేశంతో మంగళవారం ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment