Father Molested Five Years Daughter In Chilakaluripet - Sakshi
Sakshi News home page

కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి

Published Tue, Apr 26 2022 2:43 PM | Last Updated on Tue, Apr 26 2022 3:11 PM

Minor Girl Molested by Her Father in Chilakaluripet - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చిలకలూరిపేట (పల్నాడు): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాపం చేసింది కట్టుకున్న వాడైనా సహించేది లేదని జరిగిన దారుణాన్ని లోకానికి తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ కన్నతల్లి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బొప్పూడి గ్రామానికి చెందిన నూర్‌బాషా ఆదాం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్‌ సాహెబ్‌పాలేనికి చెందిన హుస్సేన్‌బీతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. షఫీ బొప్పూడిలో కుటుంబంతో నివాసం ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్‌ సెంటర్‌లోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. రాత్రిపూట పాప తండ్రి వద్ద, చిన్నవాడైన బాబు తల్లి వద్ద నిద్రిస్తారు. ఇటీవల పాపను స్కూల్‌కు పంపే క్రమంలో  తల్లి చిన్నారికి స్నానం చేయిస్తుండగా, తనకు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని రాత్రి సమయాల్లో తండ్రి పక్కన పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది.

చదవండి: (Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్‌)

వారం రోజుల్లో ఇదే విషయాన్ని పలుమార్లు తల్లికి చెప్పడంతో అనుమానించిన ఆమె భర్త ప్రవర్తనపై కన్నేసింది. ఆదివారం రాత్రి భోజనం తర్వాత భర్త షఫీ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్‌బీ నిద్రపోతున్నట్లు నటించింది. సెల్‌ఫోన్‌ లైట్‌ వేసి భార్య నిద్రపోతున్నట్లు భావించి కుమార్తె పక్క చేరాడు.

సెల్‌ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త దారుణం పసిగట్టిన హుస్సేన్‌బీ వెంటనే అపరకాళిగా మారింది. భర్తను నిలదీయడంతో  బంధువులకు సమాచారం అందించింది. దీంతోపాటు చిలకలూరిపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.    

చదవండి: (ఎస్‌ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్‌లో మాట్లాడారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement