AP CM YS Jagan Slams TDP & Co at Chilakaluripet Public Meeting - Sakshi
Sakshi News home page

మీ బిడ్డ ఒకవైపు.. తోడేళ్లన్నీ ఒకవైపు: చిలకలూరిపేట సభలో సీఎం జగన్‌

Published Thu, Apr 6 2023 12:48 PM | Last Updated on Thu, Apr 6 2023 1:50 PM

AP CM YS Jagan Slams TDP And Co at Chilakaluripet Public Meeting - Sakshi

సాక్షి, పల్నాడు: ఆరోగ్యశ్రీ పథకం పేరు వినగానే మహానేత వైఎస్సార్‌ గుర్తొస్తారు. ఖరీదైన కార్పొరేట్‌ పథకాన్ని పేదలకు అందించిన ఘనత వైఎస్సార్‌ది. అలాంటి గొప్ప పథకాన్ని వైఎస్సార్‌ చనిపోయాక నీరుగార్చారన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గురువారం చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 

పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. అందుకే వైద్య ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనకడాడం లేదు. చంద్రబాబు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను సైతం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. 2,265 ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ విస్తరించాం.  ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 3,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.  ఇప్పటిదాకా 9 వేల కోట్లు ఖర్చు చేశాం. అలాగే.. ఆరోగ్య ఆసరా కోసం రూ. 900 కోట్లు ఖర్చుచేశాం.  ఇప్పటిదాకా 35 లక్షల 71 వేలపైగా మంది ఆరోగ్య సేవలను పొందారు. 

చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్య రంగాలపై రూ. 8వేల కోట్లు ఖర్చు చేస్తే..  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై రూ. 18 వేల కోట్లు ఖర్చు చేశాం.   ఆశా వర్కర్ల జీతం పెచాం. పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ పీహెచ్‌సీలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 49వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం. శిథిలావస్థకు చేరుకున్న మరో 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో 48, 639 ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో స్టాఫ్‌ నర్సుల పోస్టులు వంద శాతం భర్తీ చేశాం. రాష్ట్రంలో 96 శాతం స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు భర్తీ చేశాం. నూరు శాతం ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశాం. 

మనది బ్రతికించే ప్రభుత్వం. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. లంచాలు, వివక్ష లేకుండా పాలన చేస్తున్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం. బటన్‌ నొక్కి  2 లక్షల 5 వేల 108 కోట్ల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.  ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం ప్రతీ గడపకూ కనిపిస్తుంది. 

స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు.. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ప్రతిపక్ష టీడీపీ అండ్‌ కోను సీఎం జగన్‌ ఏకిపారేశారు. మీ బిడ్డను ఎదుర్కొనలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. నాకు పొత్తుల్లేవ్‌. పొత్తులపై ఆధారపడను. నాకు పొత్తు ఉంటే అది మీతోనే(ప్రజలతోనే) అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే.. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి. వాళ్లలా నాకు అర్థబలం, అంగబలం లేకపోవచ్చు.  వాళ్లకు లేనిది నాకు ఉంది.. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు. నాకు తెలిసింది ఒక్కటే. నేను నేరుగా చెప్తా.  ఏదైతే చెప్తానో అదే చేస్తా.. మీ ఇంట్లో మంచి జరిగితే తోడుగా ఉండండి. మీ బిడ్డకు మీరే సైనికులు అంటూ సీఎం జగన్‌  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement