నారా లోకేష్‌కి మరోసారి షాక్‌ ఇచ్చిన ప్రజలు | Nyayaniki Sankellu Programme Utter Flop | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌కి మరోసారి షాక్‌ ఇచ్చిన ప్రజలు

Published Sun, Oct 15 2023 7:21 PM | Last Updated on Tue, Oct 17 2023 6:47 PM

Nyayaniki Sankellu Programme Utter Flop - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అంశాన్ని జనాల్లో నానుతూ ఉండేలా చేయాలని టీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా.. అన్ని ఫెయిల్‌ అవుతున్నాయి. టీడీపీకి ప్రజలు మరోసారి షాక్‌ ఇచ్చారు.

లోకేష్ పిలుపును జనాలు పట్టించుకోకపోవడంతో ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. చంద్రబాబుకు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల వరకు తాళ్లు, గుడ్డ, రిబ్బన్లతో సంకెళ్ల వేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి నామమాత్రం కూడా స్పందన లేదు. ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు.. బాల్కనీలో కూడా కనిపించలేదు.

బాబు అరెస్టుపై లోకేష్ మాటలను విశాఖ నగర వాసులు లెక్కచేయలేదు. అవినీతి పరులకు సంఘీభావం ఏమిటంటూ జనాలు నవ్వుకుంటుకున్నారు. ఇప్పటికే అట్టర్ ప్లాప్ మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి న్యాయానికి సంకెళ్లు సంఘీభావ కార్యక్రమాలు. స్వయంగా అచ్చెంన్నాయుడు పాల్గొన్న కార్యక్రమంలో కనీసం 50 మంది టీడీపీ కార్యకర్తలు కూడా కనిపించలేదు.
చదవండి: పురందేశ్వరి ‘సిండికేట్‌’ రాజకీయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement