
నారా లోకేష్ చేపట్టిన యువగళం అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది.
సాక్షి, చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు జనస్పందన కరువైంది. అట్టర్ ప్లాప్ దిశగా లోకేష్ అడుగులు పడుతున్నాయి. పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రకు జనం ఆసక్తి చూపించడం లేదు.
వ్యక్తిగత సిబ్బంది మినహా కార్యకర్తలు సైతం పెద్దగా కనిపించడం లేదు. జనాలులేక వెలవెల బోతున్న యువగళం పాదయాత్రకు కార్యకర్తలు సైతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విశేషం ఏంటంటే.. కార్యకర్తలకంటే బందోబస్తుకు వచ్చిన పోలీసులు, మీడియా సిబ్బంది సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది.