మోడీ హవా మీద ఆధారపడవద్దు: గడ్కరీ
పూణే: ప్రధాని నరేంద్రమోడీ హవా మీద ఆధారపడి ఉండవద్దని బీజేపీ కార్యకర్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ కార్యకర్తలు నిర్లక్ష్య వైఖరిని, అలసత్వాన్ని వదులకోవాలని గడ్కరీ సూచించారు. దేశంలో మోడీ హవా ఉందనేది వాస్తవం అని గడ్కరీ అన్నారు.
బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి మోడీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం మోడీ హవాతోనే అధికారంలోకి వస్తామని భ్రమలు తొలగించుకోవాలని గడ్కరీ సూచించారు.
పూణే నగరానికి మెట్రో ప్రాజెక్ట్ క్లియరెన్స్ వచ్చిందంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, డిప్యూటి సీఎం అజిత్ పవార్ లు చేసిన వ్యాఖ్యలను గడ్కరీ ఖండించారు.