పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత | Police seize cash stashed in Ajit Pawar's vehicle | Sakshi
Sakshi News home page

పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత

Published Wed, Oct 8 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత

పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత

ముంబై:  మహారాష్ట్రలో శాసనసభకు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాహానాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.  అందులోభాగంగా బుధవారం... మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్కు చెందిన కారు నుంచి రూ. 4.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పర్బినీ జిల్లా ఎస్పీ అనంత్ రొక్డే వెల్లడించారు. మరో రెండు బ్యాగ్లలో విజిటింగ్ కార్డ్స్తోపాటు భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఆ కారు డ్రైవర్ కృష్ణ హజారేను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... కారు అజిత్ పవార్దని వెల్లడించారన్నారు. పర్బనీ నుంచి లాతురు వెళ్తుండగా కారును పట్టుకున్నట్లు వివరించారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని... ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని అనంత్ తెలిపారు.  అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఆ పార్టీ నేతలు ఎవరు అందుబాటులో లేని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న రూ. 5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement