parbhani
-
పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత
ముంబై: మహారాష్ట్రలో శాసనసభకు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాహానాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా బుధవారం... మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్‌కు చెందిన కారు నుంచి రూ. 4.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పర్బినీ జిల్లా ఎస్పీ అనంత్ రొక్డే వెల్లడించారు. మరో రెండు బ్యాగ్‌లలో విజిటింగ్ కార్డ్స్‌తోపాటు భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ కారు డ్రైవర్ కృష్ణ హజారేను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... కారు అజిత్ పవార్దని వెల్లడించారన్నారు. పర్బనీ నుంచి లాతురు వెళ్తుండగా కారును పట్టుకున్నట్లు వివరించారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని... ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని అనంత్ తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఆ పార్టీ నేతలు ఎవరు అందుబాటులో లేని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న రూ. 5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గర్భం దాల్చిన కుమార్తె... నరికి చంపిన తల్లి
మైనర్ అయిన కన్న కూతురు నాలుగు నెలల గర్బిణి అని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిందా కన్న తల్లి. ఆ పని చేసిందెవరో చెప్పమని గద్దించింది. పేరు చెప్పేందుకు నిరాకరించింది. పోని గర్బిణి తీయించుకో తల్లి అంటూ కన్న తల్లి ఆ బాలికను ప్రాదేయపడింది... అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ తల్లి ఆవేశం ఉప్పెనలా పొంగింది. కన్నతల్లిగా చెప్పిన మాట వినవా అంటూ పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని కుమార్తెను తెగ నరకింది. రక్తపు మడుగులో ఆ చిన్నారి గిలగిల కొట్టుకుంటు ప్రాణాలు వదిలింది. హత్య విషయం బయటపడితే కుమార్తె గర్బిణి అన్న సంగతి బహిర్గతమవుతుందని ఆలోచించింది. అంతే పోలీసుల వద్దకు వెళ్లి కట్టుకథ అల్లింది. తన కుమార్తెను ఎవరో ఆగంతకులు హత్య చేసి ఇంట్లో నగదు, విలువైన వస్తువులు దొంగిలించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మైనర్ బాలిక మృతదేహన్ని పొస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక గర్బిణి అని పోస్ట్ మార్టం నివేదికలో తెలడంతో పోలీసులు కన్న తల్లి మాటలు పొంతన లేకుండా సమాధానం చెబుతుండటంతో ఆమెను అనుమానించి విచారించారు. దాంతో తన కుమార్తెను తానే హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన మహారాష్ట్ర పర్భనీ జిల్లాలోని ముద్గల్ గ్రామంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. -
మహారాష్ర్టలో పాగా దిశగా ఎంఐఎం అడుగులు
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనవంతు పాత్ర పోషిస్తున్న మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)... మహారాష్ట్రలోనూ పార్టీని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికే పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా మరాఠ్వాడాలోని పర్భణి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేసిన అసదుద్దీన్... తొలిసారిగా అక్కడ శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో యువకులు హాజరుకావడం విశేషం. ఇటీవలి నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలు ఆ పార్టీ నాయకులకు కొండంత ఊపిరినిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీని విస్తరించాలని నిర్ణయించినట్టు తెలి యవచ్చింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది.మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మరాఠ్వాడాలో ముస్లింలు 25 శాతం మంది ఉన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో మైనారిటీ ఓటర్ల సంఖ్య 30 నుంచి 40 శాతం దాకా ఉంది. ఇదిలాఉంచితే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునే అంశాన్ని కూడా ఎంఐఎం పరిశీలిస్తోంది. ఒకవేళ ఎంఐఎం పార్టీ ఇక్కడ కూడా బలోపేతమైతే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చని, ఆ పార్టీకి కొంతమేర నష్టం కూడా వాటిల్లవచ్చని రాజ కీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ ఓటర్లపై సమాజ్‌వాదీ పార్టీ ప్రభావం కూడా పడింది. దీంతో కొంతమంది నాయకులు ఆ పార్టీలో చేరారు.