గర్భం దాల్చిన కుమార్తె... నరికి చంపిన తల్లి
మైనర్ అయిన కన్న కూతురు నాలుగు నెలల గర్బిణి అని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిందా కన్న తల్లి. ఆ పని చేసిందెవరో చెప్పమని గద్దించింది. పేరు చెప్పేందుకు నిరాకరించింది. పోని గర్బిణి తీయించుకో తల్లి అంటూ కన్న తల్లి ఆ బాలికను ప్రాదేయపడింది... అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ తల్లి ఆవేశం ఉప్పెనలా పొంగింది. కన్నతల్లిగా చెప్పిన మాట వినవా అంటూ పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని కుమార్తెను తెగ నరకింది. రక్తపు మడుగులో ఆ చిన్నారి గిలగిల కొట్టుకుంటు ప్రాణాలు వదిలింది. హత్య విషయం బయటపడితే కుమార్తె గర్బిణి అన్న సంగతి బహిర్గతమవుతుందని ఆలోచించింది.
అంతే పోలీసుల వద్దకు వెళ్లి కట్టుకథ అల్లింది. తన కుమార్తెను ఎవరో ఆగంతకులు హత్య చేసి ఇంట్లో నగదు, విలువైన వస్తువులు దొంగిలించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మైనర్ బాలిక మృతదేహన్ని పొస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక గర్బిణి అని పోస్ట్ మార్టం నివేదికలో తెలడంతో పోలీసులు కన్న తల్లి మాటలు పొంతన లేకుండా సమాధానం చెబుతుండటంతో ఆమెను అనుమానించి విచారించారు. దాంతో తన కుమార్తెను తానే హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన మహారాష్ట్ర పర్భనీ జిల్లాలోని ముద్గల్ గ్రామంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది.