బీజేపీ హెచ్చరిక... శివసేన బేఖాతరు!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు అసాధ్యంగా కనిపిస్తోంది. సీట్ల సర్ధుబాటు వ్యవహారంలో ఇరుపార్టీలు మెట్టు దిగకపోవడంతో పొత్తు వ్యవహారం కష్టంగా మారింది.
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై ఉద్దవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు. శివసేన ఎవరి అల్టిమేటంకు తలవంచదు అని ఆపార్టీ ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. తామ ప్రతిపాదించిన ఫార్మూలా సానుకూలంగా స్పందించాలని లేకపోతే తెగతెంపులకు సిద్ధమని బీజేపీ చేసిన వ్యాఖ్యల అనంతరం థాక్రే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
288 అసెంబ్లీ సీట్లు ఉన్న అసెంబ్లీలో 135 సీట్లలో పోటీ చేయాలని బీజేపీ, శివసేనలు నిర్ణయం తీసుకున్నాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ 119, శివసేన 169 సీట్లలో పోటీ చేశారు.