మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం | MIM stuns with three victories in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం

Published Sun, Oct 19 2014 4:00 PM | Last Updated on Mon, Oct 8 2018 6:02 PM

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం - Sakshi

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలన విజయం సాధించింది. హైదరాబాద్లోనే బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం మరాఠా గడ్డపై ఊహించని ఫలితాలు నమోదు చేసింది. మూడు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోగా, మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఎంఐఎం అభ్యర్థులు వారిష్ యూసుఫ్ పఠాన్ ముంబైలోని బైకులా నియోజకవర్గం నుంచి, ఇంతియాజ్ ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి,  అబ్దుల్ గఫార్ ఔరంగాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. నాందేడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి మొయిన్ ఖాన్ ముందంజలో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 చోట్ల అభ్యర్థులను బరిలో దింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement