
ఓటేసి.. సెల్ఫీ తీసుకున్న సుప్రియ
మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ ప్రధాన అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్.. ఇలా పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సుప్రియా సూలే తాను ఓటు వేయడమే కాక.. బయటకు వచ్చిన తర్వాత వేలికి ఇంకు గుర్తు చూపిస్తూ మరికొందరు మహిళా నేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్యా పొత్తులు లేకపోవడంతో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. అన్నీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.