మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత! | Modi cuts short address at poll rally due to sore throat | Sakshi
Sakshi News home page

మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!

Published Fri, Oct 10 2014 2:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత! - Sakshi

మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!

గొంతునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన ప్రసంగాన్ని తొమ్మిది నిమిషాలకు పరిమితం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అక్కడ ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. వాస్తవానికి గురువారం నాడు జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికుల విషయంలో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయంటూ ట్రిగ్గర్ నొక్కినట్లు చూపించే సమయంలో కూడా ఆయన తన సహజశైలికి భిన్నంగా.. చాలా లోగొంతుకతో మాట్లాడారు.

గతరాత్రి వరకు తన పరిస్థితి బాగానే ఉందని, తెల్లవారుజామున ఉన్నట్లుండి బాగా ఇబ్బంది అయ్యిందని అంటున్నారు. భారీస్థాయిలో వచ్చిన ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరోసారి తప్పనిసరిగా వచ్చి అందరితో మాట్లాడతానని వాళ్లకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement