‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌ | Maharashtra Assembly Election 2024 Voting Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్‌

ఒంటి గంట వరకు 32.18 శాతం పోలింగ్‌

  • మహరాష్ట్రలో పోలింగ్‌ ముగిసింది.  
  • సాయంత్రం 5గంటల వరకు 58:22 శాతం పోలింగ్‌ జరిగింది. 
  • మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్‌ నమోదైంది
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32.18 శాతం పోలింగ్‌ నమోదు.
  • ఇంకా క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు.

 


 

 

2024-11-20 14:00:10

ఓటు వేసిన ఎంపీ హేమా మాలిని

  • ఓటు వేసిన ఎంపీ హేమా మాలిని
  • బీజేపీ ఎంపీ హేమా మాలిని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో తన కుమార్తెతో కలిసి ఓటు వేశారు. 

 

2024-11-20 13:57:30

ఓటు వేసిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఓటు వేసిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన నటి రకుల్‌, కుటుంబ సభ్యులు

ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరిన నటి. 

 

2024-11-20 13:55:15

ఓటు వేసిన సినీ ప్రముఖులు..

ఓటు వేసిన సినీ ప్రముఖులు..

ముంబైలోని పలు పోలింగ్‌ బూతుల్లో యాక్టర్‌ ప్రేమ్‌ చోప్రా, తుషార్‌ కపూర్‌ ఓటు వేశారు.

సింగర్‌ కైలాష్‌ ఖేర్‌ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్బంగా ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 

 

 


 

2024-11-20 13:11:19

మందకొడిగా సాగుతున్న పోలింగ్‌

  • మందకొడిగా సాగుతున్న పోలింగ్‌
  • ఉదయం పోలింగ్‌ సెంటర్లకు పోటెత్తిన ఓటర్లు
  • ఓటేసిన ప్రముఖులు.. క్యూలో పల్చగా  ఓటర్లు
  • మధ్యాహ్నాం తర్వాత ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం 
2024-11-20 12:31:24

  • ఓటు వేసిన మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో థాక్రే సహా కుటుంబ సభ్యులు ఓటు వేశారు.
  • వర్లీ అభ్యర్థి ఆధిత్య థాక్రే మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
2024-11-20 11:57:05

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్‌.. 
  • 11 గంటల వరకు 18.14 శాతం పోలింగ్‌ నమోదు
  • పలుచోట్ల క్యూలైన్లలో ఓటర్లు. 

 

 

2024-11-20 11:53:45

ఓటు వేసిన ముఖ్యమంత్రి షిండే

  • ఓటు వేసిన ముఖ్యమంత్రి షిండే
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్‌నాథ్‌ షిండే తన ఓట్లు హక్కు వినియోగించుకున్నారు.
  • థానేలోని పోలింగ్‌ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. 
2024-11-20 11:33:02

ఓటు వేసిన నటుడు రితీష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా

  • ఓటు వేసిన నటుడు రితీష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా
  • లాథూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 
     

 

2024-11-20 10:24:35

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రులు, ఎంపీలు

  • ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రులు, ఎంపీలు
  • ‍కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, నితిన్‌ గడ్కరీ, అశోక్‌ చవాన్‌ ఓటు వేశారు.
  • పలు పోలింగ్‌ సెంటర్‌లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 

 

 

 

2024-11-20 10:23:24

మహారాష్ట్రలో కొనసాగుతున్న ఓటింగ్‌

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న ఓటింగ్‌
  • ఉదయం తొమ్మిది గంటల వరకు 6.61 శాతం నమోదు

 

2024-11-20 09:43:55

ఓటు వేసిన బీజేపీ చీఫ్‌

  • ఓటు వేసిన బీజేపీ చీఫ్‌
  • అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర బీజేపీ చీప్‌ చంద్రశేఖర్‌ భావన్‌కులే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • నాగపూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.
  • కాంథీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉన్నారు.
2024-11-20 09:38:04

ఓటు వేసిన శరద్‌ పవార్‌

  • ఓటు వేసిన శరద్‌ పవార్‌
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • బారామతిలోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 
2024-11-20 09:18:52

ఓటు వేసిన ప్రముఖ నటుడు జాన్‌ అబ్రహం

  • ఓటు వేసిన ప్రముఖ నటుడు జాన్‌ అబ్రహం
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు జాన్‌ అబ్రహం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 
2024-11-20 09:16:43

ఓటు వేసిన ఎన్సీపీ నాయకులు

  • ఓటు వేసిన ఎన్సీపీ నాయకులు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నాయకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఎంపీ సుప్రియా సూలే, నాయకుడు నవాబ్‌ మాలిక్‌, ఇతర నాయకులు ఓటు వేశారు.
  • ఈ సందర్బంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 

 

2024-11-20 08:59:23

ఓటు వేసిన సచిన్‌ ఫ్యామిలీ..

  • ఓటు వేసిన సచిన్‌ ఫ్యామిలీ..
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్‌ సచిన్‌ సహా కుటుంబ సభ్యులు ఓటు వేశారు. 
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

2024-11-20 08:38:00

ఓటు వేసిన ఆర్బీఐ గవర్నర్‌

  • ఓటు వేసిన ఆర్బీఐ గవర్నర్‌
  • ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 

 

2024-11-20 08:22:50

ఓటు వేసిన శివసేన అభ్యర్థి సైనా ఎన్సీ

ఓటు వేసిన శివసేన అభ్యర్థి సైనా ఎన్సీ

షిండే వర్గం శివసేన అభ్యర్థి సైనా ఎన్సీ ఓటు వేశారు.

ముంబై దేవీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

ఓటు వేసిన వారే ప్రశ్నించేందుకు అర్హులని చెప్పుకొచ్చారు. 

 

 

2024-11-20 08:04:57

బారామతిలో గెలిచేది నేనే: యుగేంద్ర పవార్‌

బారామతి స్థానం నుంచి ఎన్సీపీ-ఎస్‌సీపీ అభ్యర్థి యుగేంద్ర పవార్‌ కీలక వ్యాఖ్యలు.

బారామతి నుంచి వంద శాతం విజయం మాదే.

బారామతి ప్రజలు శరద్‌ పవార్‌ను మరచిపోలేదు.

​ప్రజలు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు. 

 

2024-11-20 07:58:53

ఓటు వేసిన నటుడు అక్షయ్‌ కుమార్‌

  • ఓటు వేసిన నటుడు అక్షయ్‌ కుమార్‌
  • బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 
  • ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 
  • పోలింగ్‌ బూత్‌ వద్ద సౌకర్యాలు చాలా బాగున్నాయి. 
  • వృద్ధులు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

 

 

 

2024-11-20 07:52:12

ఓటు వేసిన నటుడు రాజ్‌కుమార్‌ రావు

  • ఓటు వేసిన నటుడు రాజ్‌కుమార్‌ రావు
  • నటుడు రాజ్‌కుమార్‌ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ముంబైలోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
  • ఈ సందర్బంగా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 

 


 

 

2024-11-20 07:45:43

ఓటు వేసిన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.

  • ఓటు వేసిన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.
  • అసెంబ్లీ ఎన్నికల్లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓటు వేశారు.
  • రాజ్‌భవన్‌ వద్ద ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

2024-11-20 07:17:25

ఓటు వేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

  • ఓటు వేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌
  • ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • నాగపూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
  • ఓటు వేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత
  • ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 
2024-11-20 07:17:25

అందరూ ఓటు హ‍క్కు వినియోగించుకోండి: ప్రకాశ్‌ అంబేద్కర్‌

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ప్రకాశ్‌ అంబేద్కర్‌
  • మొదటిసారి ఓటు వేసే వాళ్లు రాజ్యంగా పరిరక్షణ కోసం ఓటు వేయాలన్నారు. 
  • బాధ్యతగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

 

2024-11-20 07:11:28

ఓటు వేసిన డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌

  • డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చారు. 
  • ఓటు హక్కు వినియోగించుకున్న అజిత్‌ పవార్‌
  • బారామతి స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పవార్‌ బరిలో ఉన్నారు.

 

 

 

 

 

2024-11-20 07:05:57

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 

 

 

2024-11-20 07:02:33

శివసేన అభ్యర్థి ప్రత్యేక పూజలు..

  • శివసేన అభ్యర్థి ప్రత్యేక పూజలు..
  • షిండే వర్గం శివసేన అభ్యర్థి సైనా ఎన్సీ ప్రత్యేక​ పూజలు
  • ముంబాదేవీ స్థానం నుంచి బరిలో ఉన్న సైనీ ఎన్సీ

 

 

2024-11-20 07:00:33

పూణే సహా పలు ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌..

మహారాష్ట్రలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాక్‌ పోలింగ్‌ జరుగుతోంది. 

 

 

2024-11-20 06:58:10

రెండు కూటముల మధ్య రసవత్తర పోరు..

  • బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) మధ్య పోరు
  • మహారాష్ట్రలో 9.7 కోట్ల మంది ఓటర్లు
  • మహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది.
  • శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్‌) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి.
  • ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్‌ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్‌పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి.
  • వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. 
2024-11-20 06:55:44

కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభం

  • కాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 
  • 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. 

 

2024-11-20 06:46:45
Advertisement
 
Advertisement
 
Advertisement