![పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81412802152_625x300.jpg.webp?itok=HaSJB9gn)
పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి?
ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శల జోరు
మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో వ్యాఖ్యలు
మహద్ (మహారాష్ట్ర): సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తరచుగా పౌరుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైనే వివుర్శలకు దిగారు. సరిహద్దులో పాకిస్థాన్ పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాక్‌ను కట్టడి చేయుడానికి గత ముడునెలల్లో మోదీ ఏమీ చేయులేదన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లోను, లాతూరు జిల్లా అవుసాలో జరిగిన ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ప్రధాని లక్ష్యంగా తీవ్ర వివుర్శలు చేశారు. పాకిస్థాన్, చైనాలపై తావుు దూకుడుగా వ్యవహరిస్తావుంటూ లోక్‌సభ ఎన్నికలకు వుుందు నరేంద్ర మోదీ చెప్పేవారని, పాక్ పలుసార్లు కవ్వింపు చర్యలకు దిగినా గత వుూడునెలలుగా ఆయున చేసిందేమీలేదని అన్నారు. ఇటీవల భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఒకవైపు ఉయ్యూల ఊగుతూ ఉండగా, వురోవైపు, వేలాదివుంది చైనా సైనికులు లఢక్‌లోని వున భూభాగంలోకి చొరబడ్డారని అన్నారు.
మోదీపై ఓ వైపు విమర్శలు సంధిస్తూనే మరోవైపు యూపీఏ ప్రభుత్వంచేసిన అభివృద్ధి పనుల గురించి రాహుల్ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేన్సర్, వుధుమేహం, హృద్రోగాల మందుల ధరలను పెంచిందని అన్నారు. సామాన్య ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుూపీఏ హయూంలో ఉచితంగా మందులు అందించే పథకాన్ని అమలుచేసినట్టు చెప్పారు. దేశానికి కాంగ్రెస్‌నుంచి వివుుక్తి కలిగిస్తావున్న మోదీ నినాదం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజంకాబోదన్నారు. ఇక, ఎన్నికలకు కాస్త వుుందుగా కాంగ్రెస్‌తో పొత్తును తెగతెంపులు చేసుకున్న ఎన్సీపీ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించనేలేదు. కాంగ్రెస్‌కు ఓటువేయుడం అంటే వుహారాష్ట్ర అభివృద్ధికి ఓటువేయుడమే అన్నారు. స్వచ్ఛమైన వ్యక్తిత్వంగల పృధ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో వుహారాష్ట్ర ప్రగతిపథంలో వుుందుకెళ్లగలదన్నారు. కాంగ్రెస్‌కు వుళ్లీ అధికారమిస్తే సీఎంగా చవాన్‌కే వుద్దతు ఇస్తావుని ఇలా పరోక్షంగా చెప్పారు. ఆయునపై ప్రత్యర్థుల ఆరోపణల్లో వాస్తవంలేదంటూ, ఇతరుల మాదిరిగా మార్కెటింగ్ చేసేవారుకాదని పరోక్షంగా ప్రధాని మోదీపై వ్యంగాస్త్రాలు సంధించారు. మహా రాష్ట్రను ముందుకు తీసుకవెళ్లాలని బీజేపీ నాయకులు చెబుతున్నారని, కానీ మహారాష్ట్ర నేడుకూడా ప్రథమ స్థానంలో ఉందని, ఎప్పుడూ గుజరాత్‌కం టే ముందే ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.
మోదీని ‘ప్రతిపక్షనేత’గా పేర్కొన్న రాహుల్
మహారాష్ట్రలో మహద్‌లో బుధవారం తన తొలి ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ,.. ప్రధాని మోదీని ప్రతిపక్ష నేతగా ప్రస్తావించారు. ‘గత అరవై ఏళ్లుగా దేశంలో ఏమీ జరగలేదన్నట్టు ఒక ‘ప్రతిపక్షనేత’ చెబుతూ వస్తున్నారు’ అంటూ, ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత అన్నట్టుగా పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం ఒక వ్యక్తిమత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరనే రీతిలో వారి ధోరణి కొనసాగుతోందన్నారు. వారి ఆలోచనా ధోరణితో, అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ వంటివారు దేశానికి ఏమీచే యులేదన్న భావం, దానితోపాటుగా సామాన్య ప్రజలూ, వారి పూర్వీకులు కూడా ఏమీ చేయులేదన్న భావం వ్యక్తమవుతోందన్నారు. ‘మీరూ, మీరు చిందించిన చెవుటా, రక్తం కారణంగానే వునదేశం ఈ స్థితిలో ఉంది.’ అని రాహుల్ ప్రజలనుద్దేశించి అన్నారు. దేశాన్ని అరవైఏళ్లు పాలించిన వారు ఏంచేశారన్న ప్రధాని మోదీ ప్రశ్నకు సమధానంగా రాహుల్ ఈవ్యాఖ్యలు చేశారు.