‘వ్యాపారుల కోసమే మోదీ సర్కారు’
ఫిరోజ్‌పూర్ జిర్కా (హర్యానా): బడా పారిశ్రామికవేత్తల కోసమే నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం హర్యానాలో ఎన్నికల ప్రచా రం సందర్భంగా రాహుల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఫిరోజ్‌పూర్‌జిర్కా, రివా రీ, గనౌర్‌లో ఎన్నికల ర్యాలీలు, సభల్లో రాహుల్ ప్రసంగిస్తూ.. ఔషధాల ధరలపై నియంత్రణను ఎత్తేయడం ద్వారా కొన్ని అమెరికా కంపెనీలకు మేలు చేసేందుకు మోదీ ప్రయత్నించారన్నారు. దీంతో కేన్సర్ ఔషధం ధర విపరీతంగా పెరి గిందని, గతంలో రూ. 8 వేలు ఉ న్న కేన్సర్ మందు నియంత్రణ ఎత్తివేయడంతో రూ. లక్షకు చేరిం దన్నారు.
ఔషధాల ధరలు పెంచే క్రమంలో నిరుపేద కేన్సర్, మధుమేహ రోగులను మోదీ పట్టించుకోలేదన్నారు. పాక్, చై నా చొరబాట్లకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. పాక్ కాల్పుల్లో మన పౌరులు చనిపోతుంటే..6 రోజుల తర్వాత స్పందించి అంతా బాగుందని చెపుతున్నారని ఎద్దేవా చేశారు.