సాక్షి, ముంబై: వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అభ్యర్థులను బరిలో దింపాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) నిర్ణయించింది. అందుకు సంబంధిం చిన అభ్యర్థుల తుది జాబితా సిద్ధమయ్యిందని, త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అధికారికం గా దాన్ని వెల్లడిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాలా నాంద్‌గావ్కర్ చెప్పారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ప్రతిపక్షంలో ఉన్న శివసేన-బీజేపీ కూటములు ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో సిగలు పట్టుకుం టూనే ఉన్నాయి.. దీంతో ఏ నియోజకవర్గం ఏ పార్టీ ఆధీనంలోకి వస్తుంది...? ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంతవరకు సందిగ్ధంగానే ఉండిపోయింది. కాని ఎమ్మెన్నెస్ మాత్రం తమ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అభ్యర్థులను బరి లో దింపనున్నట్లు అనధికారికంగా ప్రకటించింది. కాగా విదర్భ, పశ్చిమ మహారాష్ట్రతో పోలిస్తే మిగతా ప్రాంతాల్లో అభ్యర్థులను తక్కువ సంఖ్యలో బరిలో దింపినట్లు నాంద్‌గావ్కర్ తెలిపారు.
మరఠ్వాడాలో దాదాపు అన్ని నియోజక వర్గాలలో తమ అభ్యర్థుల ను బరిలో దింపనున్నట్లు వెల్లడించారు. విదర్భలో సుమారు 35-40 మంది అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. ముంబై, ఠాణే, నవీ ముంబై, పుణే, నాసిక్ తదితర నగరాల్లో అన్ని స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 25న సాయంత్రం మాటుంగాలోని షణ్ముఖానంద హాలు లో ఎమ్మెన్నెస్ బ్ల్యూ ప్రింట్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. ఇందులో అభ్యర్థుల తుది జాబితాతోపాటు తమ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్థి చేస్తామనేది కూడా స్పష్టం చేయనున్నారని నాంద్‌గావ్కర్ తెలిపారు. అదే రోజు రాజ్ ఠాక్రే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
బ్ల్యూ ప్రింట్ విడుదల కార్యక్రమం ఈ నెల 9,10 తేదీలో జరగాల్సి ఉన్నా పితృపక్షం కారణంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులతోపాటు పార్టీ పదాధికారులు, కొందరు ముఖ్యమైన కార్యకర్తలు, మీడియా బృందాలను ఆహ్వానించనున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఒంటరిగానే..
Published Sun, Sep 21 2014 11:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement