maharashtra politics
-
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
గతమెంతో ఘనం.. వర్తమాన ‘రాజకీయం’ శూన్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారిని రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తమను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్పా నాయకులుగా ఎదగనివ్వడం లేదని తెలుగువారు ఆవేదన చెందుతున్నారు.సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రధాన పార్టీలలో ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. అయితే ముంబైతోపాటు థాణే, భివండీ, నవీముంబైలలో సుమారు 15 లక్షలకుపైగా తెలుగు ప్రజలున్నప్పటికీ ఏ పార్టీ కూడా తెలుగు అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కన్పించడంలేదు. దీంతో ఈ సారి కూడా అసెంబ్లీలో తెలుగువారి ప్రాతినిధ్యానికి మొండి చెయ్యి ఎదురైనట్లైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో అత్యధికంగా ముంబైలో 36 తర్వాత ఉమ్మడి థాణే జిల్లాలో 24 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నప్పటికీ ఒక్క రాజకీయపార్టీ కూడా తెలుగువారికి అభ్యర్థిత్వమివ్వలేదు. ఇకపై ప్రకటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.ప్రయత్నలోపమే అసలు కారణం అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ముంబై, థాణే, భివండీ, నవీముంబైలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రముఖులమని, నాయకులమని చెప్పుకునేవారెవరూ తమ తమ పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించడం లేదు. తమకు అనుకూలమైన నాయకులతో చేతులు కలిపి ఎదిగేందుకు ప్రయత్నించడం లేదా ఇతర పార్టీలతో లాభమనుకుంటే వాటిలో చేరడం తప్ప టికెట్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయడం లేదని స్థానిక తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తెలుగువారిని కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని ఇక్కడున్న తెలుగువారి ఓట్ల కోసం కూడా కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నవీముంబై జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముంబై, భివండీ, నవీముంబై, థాణే మొదలగు ప్రాంతాల్లో కొందరు కొందరు ప్రముఖ తెలుగు నాయకులున్నప్పటికీ టికెట్లు లభించే అవకాశాలు కన్పించడంలేదు. ఇలా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసించే ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో తెలుగువారెవరూ రాజకీయ చర్చల్లో చోటుకల్పించుకోలేక పోతున్నారు. అయితే కార్పొరేటర్లుగా మాత్రం ముంబై, థాణేల్లో ఒక్కొక్కరు, భివండీలో ఇద్దరు మాత్రం కార్పొరేటర్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడి, సంస్కృతీ, సంప్రదాయాల్లో మమేకమైన తెలుగువారికి ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. కలిసికట్టుగా సాగితే ఫలితం... తెలుగు వారంతా కలిసికట్టుగా ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్‌నైనా దక్కించుకుని వారిని గెలిపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై, థాణే, నవీ ముంబైల్లో అనేక మంది విద్యావేత్తలతోపాటు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నవారున్నారు. అనేక మందిలో సేవాభావం, సమాజసేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలనే తపన కూడా ఉంది. కానీ ఐకమత్యం లేకపోవడం, అందరినీ ఏకంచేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలం కావడంలేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలో కులమతాలు, ప్రాంతాల తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఫలితం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు కార్పొరేటరున్నప్పటికీ రాబోయే రోజులలో తెలుగు వారు ఏకమైతే ప్రధాన పార్టీలు అనేక ప్రాంతాల్లో తెలుగు వారికి కార్పొరేటర్ పదవులిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లభించలేదని నిరుత్సాహ పడకుండా ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలకు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు నాయకులందరూ సిద్ధమవ్వాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై థాణే జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకునేందుకు, తెలుగు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిఉంది.ఘనచరిత్రే..ముంబైలో తెలుగు వారిది ఘనమైన చరిత్ర. ముంబై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది క్రియాశీలపాత్ర. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి సుమారు 1950 వరకు తెలుగు వారంతా రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ తరువాత మాత్రం రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటాప్‌హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అదేవిదంగా థాణే, నవీముంబై, భివండీ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా ఎన్నికైన సయాజీ శీలం తెలుగువారే. ఆయనతోపాటు అనేక మంది తెలుగువారు మేయర్, కార్పొరేటర్ సహా అనేక పదవులను చేపట్టారు. -
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
నాకు చెప్పడానికి నువ్వు ఎవరు.. అజిత్‌కు శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్
ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి షాకిస్తూ అజిత్ పవార్.. షిండే వర్గంలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో షిండే సర్కార్ అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం కుర్చీని ఇచ్చింది. ఈ క్రమంలో అజిత్ పవార్‌కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా పవార్ మాట్లాడుతూ.. తాను అలసిపోనని, రిటైర్ కానని.. కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్‌కు కౌంటర్ ఇచ్చారు. మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు. తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు. నేను అలసిపోను... రిటైర్ కూడా కాను.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు? అంటూ ఫైరయ్యారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ.. సీఎం ఏక్నాథ్ షిండే టార్గెట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా చదవండి: పొలం బాట పట్టి.. రైతులతో రాహుల్ గాంధీ ములాఖత్ -
బీజేపీ ప్లాన్ అదేనా!.. మహారాష్ట్రలో సీఎం షిండేకు షాక్?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన ప్రభుత్వ కూటమిలో అజిత్ పవార్ వర్గం చేరిపోయింది. దీంతో, అజిత్ పవార్‌కి డిప్యూటీ సీఎం పదవి దక్కగా మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ నేతలు కూడా ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సర్కార్‌పై ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్య అనుచరుడు, ఎంపీ సంజయ్ రౌత్ కూడా మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ కార్యక్రమంలో రౌత్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరినప్పటి నుండి షిండే గ్రూపులోని దాదాపు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని అన్నారు. షిండే క్యాంపు నుండి 17-18 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదించారు అని వ్యాఖ్యలు చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలపై షిండే వర్గం ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. #WATCH | Mumbai: "I have heard that CM (Eknath Shinde) has been asked to resign and there might be some change (in the govt), says Uddhav Thackeray faction leader Aaditya Thackeray (07.07) pic.twitter.com/IBW7HNfmoB — ANI (@ANI) July 7, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి అజ్ఞాతవ్యక్తి.. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని.. -
మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్’.. గడ్కరీ అదిరిపోయే సెటైరికల్ పంచ్
నాగపూర్: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు శివసేన గుర్తుపై పొలిటికల్ ట్విస్టులు చోటుచేసుకోగా, తాజాగా ఎన్సీపీలో రాజకీయం వేడెక్కింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్‌కు షాక్ తగిలింది. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఆయన వర్గానికి మంత్రి పదవులు కూడా ఇచ్చేందుకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అంగీకరించింది. అయితే శాఖల కేటాయింపుల విషయంలో షిండే వర్గం, బీజేపీ, పవార్ వర్గం మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. మరోవైపు, ప్రభుత్వంలోకి అజిత్ పవార్ రాకతో.. మంత్రి పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శిందే వర్గం, బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అయితే, నితిన్ గడ్కరీ నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మహా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులకు ఇప్పుడు క్యూ పెరిగింది. మంత్రి పదవి తమదనేని ఆశించిన నేతలకు ఇప్పుడు తాము ‘కుట్టించుకున్న సూట్ల’ను ఏం చేయాలో తెలియడం లేదు అంటూ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ‘ప్రజలు తమకు దక్కిన వాటితో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. నేను ఆశించిన దాని కంటే ఎక్కువ పొందాను అని ఓ వ్యక్తి అంగీకరించగలిగితే అప్పుడే అతను సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. లేదంటే కార్పొరేటర్లు తమకు ఎమ్మెల్యే పదవి దక్కలేదని, ఎమ్మేల్యేలు తమకు మంత్రి పదవులు రాలేదని బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు కొందరి పరిస్థితి అలాగే (మహారాష్ట్ర రాజకీయాలను ఉద్దేశిస్తూ)ఉంది. మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన వారు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులు దక్కించుకునేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో తమ వంతు వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. పైగా మంత్రి పదవి ఆశించిన వారు ఇప్పటికే ప్రమాణ స్వీకారం కోసం సూట్లు కుట్టించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రద్దీ పెరగడంతో ఆ సూట్లను ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఛేంజ్.. మోదీ కీలక నిర్ణయం! -
అజిత్ పవార్ చేరికపై అసంతృప్తి, సీఎం రాజీనామా!.. స్పందించిన శివసేన
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కూటమిలోనూ ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై పట్టుకోసం బాబాయ్-అబ్బాయ్ మధ్య తీవ్ర వార్ నడుస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని చీల్చుతూ ఆయన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఎనిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఏక్నాథ్ శిండే(శివసేన) వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివసేనలో చిచ్చు మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని, అసంతృప్తితో ఉన్న 8–10 మంది మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. పార్టీలో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హడావిడీకి ముంబైకి వచ్చారని వదంతులు వ్యాపించాయి. ఏ గందరగోళం లేదు తాజాగా శివసేనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ నేత ఉదయ్ సావంత్ ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై శివసేనలో ఎలాంటి విభేదాల్లేవని, ఎవరో గిట్టనివారు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఏక్నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచనలు కూడా లేనట్లు స్పష్టం చేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. చదవండి: NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు సీఎం అత్యవసర భేటీ బుధవారం ముర్ముకు స్వాగతం పలికేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లిన శిండే తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన నివాసంలో అత్యవసరంగా భేటీ అయిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఉదయ్ సావంత్ మాట్లాడుతూ.. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు. షిండే సారథ్యంలో తమ ప్రభుత్వం ప్రశాంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సీఎం ప్రతి ఒక్కర్నీ కలుపుకొంటూ వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమని ఆయన అన్నారు. బుధవారం నాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఎన్సీపీతో వెళ్లవద్దని వాదన? శిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎవరూ ఎటు వెళ్లాల్సిన పని లేదని, ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. గతంలో తాము ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్దవ్) నుంచి బయటకి వస్తే.. మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించారని, ప్రస్తుతం ఎన్సీపీ కూడా అదే బాట పట్టిందని సామంత్ అన్నారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో కలవడం అంటే ఇప్పుడు శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. -
Maharashtra political crisis: ‘మహా కుదుపు’.. నిలువునా చీలిన ఎన్సీపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. ఒక్కరోజులోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. కాగా, పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముంబై/పుణే/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా అజిత్ పవార్ తొలుత ముంబైలోని తన అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో, కొందరు నాయకులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం శానససభలో ప్రతిపక్ష నేత పదవికి అజిత్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత అజిత్ తన ఎమ్మెల్యేలలో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకొని, ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు. అయితే, అజిత్ పవార్‌కు 36 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరాం: అజిత్ æ దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరామని అజిత్ చెప్పారు. ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయానికి పార్టీ ప్రజాప్రతినిధులందరూ మద్దతునిచ్చారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎన్సీపీ పేరుతో, ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు. పరిపాలనలో తమకు ఎంతో అనుభవం ఉందని, ప్రజలకు మేలు చేయడానికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానించారు. తనతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మందికి త్వరలోనే శాఖలు కేటాయించనున్నట్లు అజిత్ వెల్లడించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉన్నారన్నారు. ప్రధాని∙మోదీ నాయకత్వంపై అజిత్‡ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వంగా మారిందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో అభివృద్ధి ఇక వేగం పుంజుకుటుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీపీ ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జితేంద్రను నియమించినట్లు పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలంతా తాను చేసే విప్‌నకు కట్టుబడి ఉండాలని జితేంద్ర అవద్ పేర్కొన్నారు. బీజేపీ వాషింగ్ మెషీన్..: కాంగ్రెస్ మహారాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ వాషింగ్ మెషిన్ మళ్లీ పని ప్రారంభించిందని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారని, ఇక వారందరికీ క్లీన్ చిట్ వస్తుందని చెప్పారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి మహారాష్ట్రకు విముక్తి కలి్పంచడమే తమ లక్ష్యమని తెలిపారు. శరద్‌కు ఖర్గే, రాహుల్ గాంధీ మద్దతు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. ఇద్దరు నేతలు పవార్‌తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితి తెల్సుకున్నారు. పార్టీని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవు: శరద్ పవార్ పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తేలి్చచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన ఆదివారం పుణేలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఇలాంటివి చూడడం తనకు కొత్తేమీ కాదన్నారు. బీజేపీ–శివసేన ప్రభుత్వం చేరాలన్నది తమ పార్టీ నిర్ణయం ఎంతమాత్రం కాదన్నారు. కొందరు నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ప్రభుత్వంలో చేరినట్లున్నారని అభిప్రాయపడ్డారు. ఇది తన ఇంటి సమస్య కాదని, ప్రజల సమస్య అని చెప్పారు. మద్దతు కోసం సోమవారం నుంచే ప్రజల్లోకి వెళ్తానని, పార్టీని పునర్నిరి్మస్తానని శదర్ పవార్ పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ నాయకులతో సమావేశమవుతానని, పార్టీకి సంబంధించిన నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో త్వరలో జరిగే విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటానని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అస్థిరతే నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల తర్వాత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టగా బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దాంతో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత బీజేపీకి అజిత్ అండగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలపాటు మనుగడ సాగించింది. ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది జూన్‌లో శివసేన నేత షిండే తిరుగుబాటు చేశారు. శివసేనలో చీలిక ఏర్పడింది. ఎంవీఏ ప్రభుత్వం కూలింది. బీజేపీతో మద్దతుతో షిండే గత ఏడాది జూన్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వంలో అజిత్‡ చేరడం ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్లలో మూడుసార్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పొలిటికల్ పవర్ ఇదీ! అజిత్ పవార్.. ఎన్సీపీని నిట్ట నిలువుగా చీల్చి మరోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి కొద్ది రోజులు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఇప్పుడు అధినేత శరద్ పవార్‌కు షాక్ ఇస్తూ పార్టీని చీల్చారు. 2019 నవంబర్ నుంచి 2022 జూన్ వరకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అజిత్ 2019 తర్వాత ముచ్చటగా మూడోసారి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గతంలో కూడా కాంగ్రెస్–ఎన్సీపీ కలిసి 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ హయాంలో డిప్యూటీ సీఎంగా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీలో గట్టి పట్టున్న నాయకుడు. ప్రస్తుతం అజిత్ పవార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారి వారి చక్కెర సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణల్ని, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అజిత్ పవార్ పార్టీని చీల్చడానికి ఈ కేసులు కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల కుంభకోణం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కార్యకర్తల ఒత్తిడితో శరద్ పవార్ వెనక్కి తీసుకున్న సమయంలో అజిత్ పవార్ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలుసుకున్నారు. ఇక శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం అజిత్ పవార్‌కు మింగుడు పడలేదని, అందుకే ఆయ పార్టీని చీల్చారన్నది బహిరంగ రహస్యమే. మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన 56 ఎన్సీపీ 54 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 ఏ మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 ప్రస్తుతం పార్టీల బలాబలాలు పార్టీ స్థానాలు బీజేపీ 105 శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 16 శివసేన(షిండే) 40 ఎన్సీపీ(శరద్ పవార్) 18 ఎన్సీపీ(అజిత్ పవార్) 36 కాంగ్రెస్ 44 ఇతర పార్టీలు+స్వతంత్రులు 29 -
ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగడానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోకుండా∙ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. అప్పట్లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వ్యవహరించిన తీరు సమర్థనీయంగా లేనప్పటికీ ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏక్నాథ్ షిండేను ఆదేశించలేమని పేర్కొంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం, తద్వారా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన 8 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం∙తీర్పు వెలువరించింది. ‘సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదు. ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించి తీరు చట్టబద్ధంగా లేదు. సభలో బల పరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఉద్ధవ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ మద్దతున్న షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది సమర్థనీయమే’ అని వెల్లడించింది. ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు చేసి, షిండే పక్షాన చేరిన శివసేన ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత వేటు వేయలేమని తెలియజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్‌కు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసు ఇచ్చే అధికారం ఉందా? అనేది తేల్చడానికి అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. షిండే రాజీనామా చేయాలి: ఉద్ధవ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అప్పటి గవర్నర్ తీరును కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. వారు(షిండే వర్గం ఎమ్మెల్యేలు) తమ పారీ్టని, తండ్రి బాల్ ఠాక్రే అందించిన వారసత్వానికి దగా చేశారని మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం చట్టప్రకారం పొరపాటే అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తూ పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. వెన్నుపోటుదారులతో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. చదవండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు భారీ ఊరట.. కేంద్రానికి షాక్ -
మహారాష్ట్రపై కేసీఆర్ నజర్.. బీఆర్ఎస్తో టచ్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రంలో విస్తరణ దిశగా బీఆర్ఎస్ను పరుగులు పెట్టేంచేలా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల నుంచి వివిధ పారీ్టల మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితిని అనువుగా మలుచుకుని చేరికల జోరు పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన అభ్యర్థులు బీఆర్ఎస్లో చేరారు. ఎన్సీపీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మూడురోజుల క్రితం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఎన్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక వ్యవహారంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఎన్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల చేరిక ఖాయమైన తర్వాత మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? ‘మహా’పాలిటిక్స్‌పై కేసీఆర్ లెక్కలు మహారాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉన్నాయనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు, పార్టీల సంస్థాగత లోపాలను అనువుగా మలుచుకుని బీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎన్సీపీ, శివసేన(థాక్రే, షిండే) వర్గాల్లో నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ విస్తరణకు అనుకూలంగా ఉందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలను ప్రోత్సహించేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ నెల 2న తెలంగాణ భవన్లో మహారాష్ట్ర నేతలతో జరిగిన భేటీలో బీఆర్ఎస్ సిద్ధాంతాలు, లక్ష్యాలను వివరించడంతోపాటు చేరికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అనేక అంశాలపై చర్చించారు. మహారాష్ట్రకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని వెల్లడించారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్ రాజీనామా ప్రకటన, తర్వాత వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీ సుప్రియా సూలే మధ్య ఆధిపత్యపోరుతో పార్టీలో చీలిక అనివార్యమనే అంశాన్ని అక్కడి నేతలు కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఎన్సీపీకి 50కిపైగా మంది శాసనసభ్యులు ఉండగా, ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్‌పవార్ వర్గంలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. శివసేన రెండువర్గాల నేతలు కూడా కేసీఆర్‌కు టచ్‌లోకి వచ్చినట్లు మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ తరఫున పర్యవేక్షిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. ఇప్పటికే పలువురు మాజీల చేరిక నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నాసాహెబ్ మానే, హర్షవర్దన్ జాదవ్, శంకరన్న దోంగ్డె, రాజు తొడ్సమ్ గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఔరంగాబాద్ జెడ్పీ చైర్మన్, గత ఎన్నికల్లో పోటీ చేసిన సంతోష్ కుమార్ వంటి నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల రాకతో చేరికల వేగం మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ మోడల్‌పై చర్చకు షిండే హామీ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని వినాయక్ పాటిల్ అనే మహారాష్ట్రవాసి ఐదురోజులుగా ఆమరణదీక్ష చేస్తున్నారు. వినాయక్ పాటిల్ అరోగ్యం విషమించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. మే 9న తెలంగాణలో అమలవుతున్న పథకాలు, తెలంగాణ మోడల్‌పై చర్చిద్దామని సీఎం షిండే హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: నా గొంతులో ప్రాణమున్నంత వరకు రామన్న చెయ్యి వదిలేది లేదు.. తెలంగాణ జాతిపితకే జీవితం అంకితం -
షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..?
ముంబై: మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. మీడియా వర్గాలు తనకు ఈ విషయపై కచ్చితమైన సమాచారం అందించాయని పేర్కొన్నారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు. 'ఇది నిజమేనా? షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్చుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా?' అని క్యాస్ట్రో ట్వీట్ చేశారు. Is this true too??? There is news that Mr.@mieknathshinde has taken 3 days' leave from work. Sources in the media say that he has taken leave as he is upset because @BJP4India wants him to 'switch roles' in the incumbent Maharashtra government with Mr. @Dev_Fadnavis. — Clyde Crasto - क्लाईड क्रास्टो (@Clyde_Crasto) April 25, 2023 మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్సీపీ కూడా సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కాగా.. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపారు షిండే. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ బెదిరించిందని, తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..! -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్‌ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే వర్గంలోకి సొంత కుటుంబ సభ్యులు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్ థాక్రేకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలతో పాటు కుటుంబ సభ్యుల్లోనూ కొందరు షిండే వర్గానికి మద్దతు తెలుపుతుండటం ఉద్ధవ్‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరో షాక్ తగిలింది. బాల్‌థాక్రే మనుమడు, ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్ థాక్రే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిహార్ థాక్రేకు ఇప్పటి వరకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షిండేను కలవటం హాట్‌టాపిక్‌గా మారింది. బాల్ థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ థాక్రే కుమారుడే నిహార్ థాక్రే. బిందుమాధవ్.. 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన సినీ నిర్మాతగా ఉండగా.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే.. ఆయన కుమారుడు నిహార్.. తాజాగా షిండేను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ఉద్ధవ్ మరో సోదరుడు జైదేవ్ థాక్రే మాజీ భార్యా స్మితా థాక్రే సైతం ఇటీవలే సీఎం షిండేను కలిశారు. నిహార్ థాక్రే ఒక న్యాయవాది. ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మంత్రిగానూ సేవలందించారు. వలసలు పెరిగిన క్రమంలో షిండేపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్ధవ్ థాక్రే. తాను అనారోగ్యానికి గురైనప్పుడు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
ఈసీ ఆదేశాలతో ‘శివసేన’పై ఉత్కంఠ.. సుప్రీం కోర్టుకు పంచాయితీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో పొత్తుతో సీఎం పదవిని అధిరోహించారు. ఆ తర్వాత కొందరు ఎంపీలు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో శివసేన తమదే నంటూ ఇటు షిండే వర్గాలు పేర్కొనగా.. థాక్రే వర్గాలు తమదేనని బలంగా వాదిస్తున్నాయి. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది థాక్రే వర్గం. ‘ఈనెల 22న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీని అనుమతించినట్లయితే.. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల సమస్యలను ఆక్షేపించటమే కాకా.. ఈసీ చర్యల వల్ల కోలుకోలేని దెబ్బపడుతుంది. శాసనసభ్యులుగా అనర్హులైన వారి పిటిషన్లు చెల్లవు. ప్రస్తుత సమయంలో ఈసీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. ’ అని పేర్కొంది. షిండే వర్గం అక్రమంగా తమకు ఎక్కువ మద్దతు ఉందని చెబుతోందని, కృత్రిమ మెజారిటీని సృష్టిస్తోందని ఆరోపించింది ఉద్ధవ్ థాక్రే వర్గం. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొంది. శివసేన ఎవరిదనే అంశంలో ముందుకు వెళ్లకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొంది థాక్రే వర్గం. ఇదీ చదవండి: ఇది కదా అసలు ట్విస్ట్.. మహారాష్ట్ర సీఎం షిండే, ఉద్ధవ్ థాక్రేకు బిగ్ షాక్ -
శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ
‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’ అంటూ వచ్చాడు ఏక్నాథ్ శిందే. అప్పుడు నేను ఆశీర్వదించగలిగిన భౌతికస్థితిలో ఉన్నప్పటికీ, ఆశీర్వదించేందుకు తగిన అనుకూల స్థితిలో లేను. ఫోన్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు. ఠాక్రే అంటున్నాడు.. ‘‘పవార్జీ! ఈ లోకం మీద నాకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి..’’ అని. ఆ టైమ్‌లో వచ్చాడు ఏక్నాథ్ శిందే! వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు. చెప్పకుండా నేరుగా సౌత్ ముంబైలో నేనుంటున్న సిల్వర్ ఓక్స్ బంగళాకే వచ్చేశాడు. ఈస్ట్ బాంద్రాలోని ఠాక్రేల ఇల్లు ‘మాతోశ్రీ’కి, మలబార్ హిల్స్‌లోని సీఎం అధికారిక భవంతి ‘వర్ష’కు, ఆ దగ్గర్లోనే ఉండే ప్రభుత్వ అతిథి గృహం ‘సహ్యాద్రి’కి కూడా అతడు ఇలా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. వేటినీ తనవి కావు అనుకోడు. ‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’’ అన్నాడు మళ్లీ శిందే నాకు మరింతగా దగ్గరకు వచ్చి.. నా ఎదురుగా మోకాలిపై కూర్చుంటూ! నేనప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను. ‘‘లేచి, పైన కూర్చో శిందే...’’ అన్నాను, సోఫా వైపు చూపిస్తూ. అతడు లేవలేదు! ‘‘ఎవరు పవార్జీ మీ దగ్గర.. శిందేనేనా?’’ అంటున్నాడు అటువైపు ఫోన్లో ఉద్ధవ్. ఎవరో వచ్చినట్లున్నారు.. ఫోన్ పెట్టేద్దాం.. అని అతడూ అనుకోవడం లేదు! ‘‘అవును ఉద్ధవ్... శిందేనే...’’ అన్నాను.. ఫోన్లో ఉద్ధవ్ ఉన్నాడని శిందేకు తెలిసేలా. ‘‘ఏంటట పవార్జీ..’’ అన్నాడు ఉద్ధవ్! ‘‘ఉద్ధవ్ నేను మళ్లీ చేస్తాను. మళ్లీ చేసేంత టైమ్ నాకు దొరకడం లేదని నీకనిపిస్తే కనుక నువ్వే నాకొకసారి చెయ్యి..’’ అని, ఉద్ధవ్ ఫోన్ పెట్టేసే వరకు ఆగాను. శిందే ఇంకా మోకాలి మీదే ఉన్నాడు. ‘‘తిరుగుబాటు చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా పవార్జీ..’’ అన్నాడు. అతడి చెయ్యి మీద చెయ్యి వేశాను. శిందే అప్పటికే అనేకమంది ఆశీర్వాదాలు పొంది, ఇక్కడికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి ముందు.. తన దివంగత రాజకీయ గురువు బాల్ ఠాక్రేను, తన స్వర్గీయ ఆధ్యాత్మిక గురువు ఆనంద్ డిఘేను తలచుకుని, వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించాడు. మోదీ, షాల ఆశీర్వాదాలకు భక్తి శ్రద్ధలతో తలవొగ్గాడు. వారివే కాకుండా.. అంకెలకు సరిపడినన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే అప్పుడు శిందే మీద కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా అన్ని ఆశీర్వాదాలు ఉండి కూడా, నా ఆశీర్వాదం కోసం వచ్చాడంటే.. అతడు కేవలం ఆశీర్వాదం కోసమే వచ్చాడని. ‘‘కోపమేం లేదు శిందే. తిరుగుబాటు చెయ్యడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోవడం..’’ అన్నాను అతడి తలపై నా అరచేతిని ఆన్చి. అప్పుడు లేచాడు శిందే. ‘‘వెళ్లొస్తాను పవార్జీ’’ అని చేతులు జోడించాడు. అతడటు వెళ్లిపోయాక, నేనిటు నలభై నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఇప్పుడు ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు చేసినట్లే అప్పట్లో వసంతదాదా పాటిల్‌పై నేను తిరుగుబాటు చేశాను. తప్పలేదు. తప్పనిపించలేదు. ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వాళ్లు మనిషిగా బతికి ఉన్నట్లు! అవమానాలు భరిస్తూ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయలేదంటే.. వాళ్లు ఒక మనిషి కోసం చూస్తున్నట్లు. అందుకే నేను తిరుగుబాటుదారుడిని గౌరవిస్తాను.. అతడు 1857 పాండే అయినా, 2022 శిందే అయినా. ఉద్ధవ్ మళ్లీ నాకు ఫోన్ చేస్తే చెప్పాలి.. లోకం మీద మనకు విశ్వాసం సన్నగిల్లితే లోకానికి పోయేదేమీ లేదని, అవిశ్వాస తీర్మానానికి ముందే మన మీద మనం విశ్వాసం కోల్పోతే లోకం వచ్చి చేసేదేమీ ఉండదని! -
మహారాష్ట్ర సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. షిండేతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్దవ్ సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్ అయ్యారు. షిండే రాజకీయ ప్రస్థానం 1964 ఫిబ్రవరి 9న ఏక్నాథ్ షిండే జన్మించారు. యశ్వంతరావు వాన్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చదవండి: ‘మహా’ ట్విస్ట్.. సీఎం పీఠం వదులుకున్న బీజేపీ.. -
శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు పూట పూటకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే ఊహాగానాల నడుమ.. శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ తాజా ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ఆయన మీడియాకు చెప్పడం విశేషం. ఈ తరుణంలో.. దొరికిన అవకాశం చేజార్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అస్సాం నుంచే ఇది మొదలైనట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో సహా మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ సేన రెబల్స్ గనుక తమతో చేతులు కలపాలని, బదులుగా భారీగా పోర్ట్‌పోలియో వాళ్ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రెబల్స్ గనుక తమతో కలిసి వస్తే.. ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసింది. ఒకవేళ శివ సేన ఎంపీలు గనుక వస్తే.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు భోగట్టా. ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్ థాక్రేను కలవకుండానే.. ఏక్నాథ్ షిండే మూడు పేజీల లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్ రౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్‌లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని రౌత్ ప్రకటించడం గమనార్హం. ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్ రౌత్ మీడియాతో వ్యాఖ్యానించారు. బలపరీక్ష ఎప్పుడు జరుగుతుందో అందరూ చూస్తారు, పార్టీని వీడే వారు బాలాసాహెబ్ భక్తులు కాదు.. ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే ఎలాంటి భేటీ నిర్వహించబోవడం లేదంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..? -
సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు. ఉద్ధవ్ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాక్రే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఎమ్మెల్యేలను ఏనాడు సీఎం థాక్రే పట్టించుకోలేదుంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీ నేతలను బీజేపీ బంధించింది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022 ఇది కూడా చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్ -
Maharashtra Political Crisis: శివసేన..సంక్షోభ సేన
కరడు గట్టిన హిందుత్వవాదంతో పుట్టుకొచ్చిన శివసేనకు తిరుగుబాట్లు కొత్త కాదు. పార్టీ గతంలో మూడుసార్లు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. తొలి మూడు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాంలో జరిగాయి. తాజాగా ఏక్నాథ్ షిండే సంక్షోభం ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టాక తొలి తిరుగుబాటు. 1966లో హిందూత్వ పునాదులపైనే బాల్‌ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన 56 ఏళ్ల చరిత్రలో ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలు, అసంతృప్త నాయకులెరో చూద్దాం... నారాయణ్ రాణే శివసేన అధినేత బాల్ ఠాక్రే ఏరి కోరి 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేసిన నారాయణ రాణె ఆ తర్వాత ఠాక్రేకు పక్కలో బల్లెంలా మారారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో పట్టున్న ఈ నాయకుడు పార్టీలో శాఖ ప్రముఖ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా సీఎంగా ఎదిగారు. శివసేనని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో బాల్‌ఠాక్రే 2005లో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. ఆ తర్వాత రాణె కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లు కొనసాగి ఎలాంటి ప్రాధాన్యం దక్కక తిరిగి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. చగన్ భుజ్‌బల్ 1991 సంవత్సరంలో శివసేనకి చగన్ భుజ్‌బల్ రూపంలో సంక్షోభం ఎదురైంది. పార్టీలో ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్ గ్రామీణ మహారాష్ట్రలో పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు లభించడానికి చగన్ భుజ్‌బల్ అలుపెరుగని కృషి చేశారు. అయినప్పటికీ పార్టీ అధినేత బాల్ ఠాక్రే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మనోహర్ జోషిని నియమించారు. మనస్తాపానికి గురైన భుజ్‌బల్ 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడారు. ఠాక్రే మంత్రాంగంతో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి సేన గూటికి చేరుకోవడంతో సంక్షోభం సమసిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎన్సీపీలో చేరిన భుజ్‌బల్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజ్ ఠాక్రే 2006 సంవత్సరంలో తన సొంత కుటుంబం నుంచే బాల్‌ఠాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. బాలాసాహెబ్ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్నదానిపై అంతర్గత పోరు నడిచింది. బాల్‌ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడైన రాజ్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఆశించారు. బాల్‌ఠాక్రే వారసుడిగా తననే ప్రకటించాలని పట్టుపట్టారు. కానీ బాలాసాహెబ్ తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే వైపే మొగ్గు చూపించారు. రాజ్‌ఠాక్రేకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. దీంతో రాజ్‌ఠాక్రే 2005లో పార్టీకి రాజీనామా చేసి , 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఏక్నాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యాక కుమారుడు ఆదిత్య ఠాక్రేకి అధిక ప్రాధాన్యమిస్తుండటం షిండేకు మింగుడుపడలేదు. చివరికి తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆదిత్య ఠాక్రే జోక్యం చేసుకుంటూ ఉండటం అసంతృప్తికి ఆజ్యం పోసింది. శివసేనలో కింద స్థాయి నుంచి ఎదిగిన షిండేకి పార్టీపై మంచి పట్టు ఉంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన కొన్ని గంటల్లోనే షిండే తిరుగుబావుటా ఎగురవేశారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేనికైనా రెడీ.. ఉద్దవ్ థాకరే సంచలన ప్రకటన
-
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
బీజేపీ మహిళా నేత అనూహ్య పోస్ట్..!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక, భవిష్యత్ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు పంకజ ముండే ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. గత బీజేపీ సర్కార్‌లో పంకజ (40) గ్రామీణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన కజిన్ సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో 30వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంకజ ముండే తాజాగా పెట్టిన పోస్టు ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. ‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె తెలిపారు. బీడ్ జిల్లాలోని తన తండ్రి స్మారక కేంద్రం గోపీనాథ్ ఘాట్ వద్దకు 12వ తేదీన తమ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తన కజిన్ ధనుంజయ్ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.