
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశమయ్యారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారు. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే రైతాంగ సంక్షోభంపై వారిద్దరు చర్చించారని ఆ తరువాత సీఎంఓ ట్వీట్ చేసింది.
ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకెళ్లింది: నవాబ్ మాలిక్
ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురిని బీజేపీ విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లిందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. తాము ఎన్సీపీతోనే ఉన్నామని వారు ఆ తరువాత వీడియో సందేశాలు పంపించారన్నారు.