
ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి షాకిస్తూ అజిత్ పవార్.. షిండే వర్గంలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో షిండే సర్కార్ అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం కుర్చీని ఇచ్చింది. ఈ క్రమంలో అజిత్ పవార్‌కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు.
తాజాగా శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా పవార్ మాట్లాడుతూ.. తాను అలసిపోనని, రిటైర్ కానని.. కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్‌కు కౌంటర్ ఇచ్చారు. మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు. తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు. నేను అలసిపోను... రిటైర్ కూడా కాను.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు? అంటూ ఫైరయ్యారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ.. సీఎం ఏక్‌నాథ్ షిండే టార్గెట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్‌లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: పొలం బాట పట్టి.. రైతులతో రాహుల్ గాంధీ ములాఖత్
Comments
Please login to add a commentAdd a comment