ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన ప్రభుత్వ కూటమిలో అజిత్ పవార్ వర్గం చేరిపోయింది. దీంతో, అజిత్ పవార్‌కి డిప్యూటీ సీఎం పదవి దక్కగా మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ నేతలు కూడా ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సర్కార్‌పై ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్‌లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్య అనుచరుడు, ఎంపీ సంజయ్ రౌత్ కూడా మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ కార్యక్రమంలో రౌత్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరినప్పటి నుండి షిండే గ్రూపులోని దాదాపు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని అన్నారు. షిండే క్యాంపు నుండి 17-18 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదించారు అని వ్యాఖ్యలు చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలపై షిండే వర్గం ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.
#WATCH | Mumbai: "I have heard that CM (Eknath Shinde) has been asked to resign and there might be some change (in the govt), says Uddhav Thackeray faction leader Aaditya Thackeray (07.07) pic.twitter.com/IBW7HNfmoB
— ANI (@ANI) July 7, 2023
ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి అజ్ఞాతవ్యక్తి.. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని..
Comments
Please login to add a commentAdd a comment