CM Devendra phadnavis
-
ఫడ్నవీస్, అజిత్ పవార్ రహస్య చర్చలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశమయ్యారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారు. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే రైతాంగ సంక్షోభంపై వారిద్దరు చర్చించారని ఆ తరువాత సీఎంఓ ట్వీట్ చేసింది. ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకెళ్లింది: నవాబ్ మాలిక్ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురిని బీజేపీ విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లిందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. తాము ఎన్సీపీతోనే ఉన్నామని వారు ఆ తరువాత వీడియో సందేశాలు పంపించారన్నారు. -
నిర్లక్ష్యం వల్లే మావోల దాడి
గడ్చిరోలి/న్యూఢిల్లీ: గడ్చిరోలి జిల్లాలో 15 మంది పోలీస్ కమాండోలు, ఓ డ్రైవర్‌ను బలికొన్న ఘటనలో సిబ్బంది ప్రామాణిక నిర్వహణా విధానాన్ని(ఎస్పీవో) పాటించలేదని మహారాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దాదర్‌పూర్ వద్ద 36 వాహనాలను దహనం చేసిన మావోలు పోలీసులు అక్కడకు వచ్చేలా ఉచ్చు పన్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలు చిన్న బృందాలుగా విడిపోయి కాలినడకన ఘటనాస్థలికి చేరుకుంటాయని వెల్లడించారు. కానీ గడ్చిరోలిలో క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) కమాండోలు నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేటు వ్యానులో దాదర్పూర్కు బయలుదేరారనీ, తద్వారా మావోలు పక్కా ప్రణాళికతో చేసిన ఐఈడీ దాడిలో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా జవాన్లు కనీసం మైన్ప్రూఫింగ్ వాహనాన్ని వాడకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఇక్కడి భద్రతను, కూంబింగ్ ఆపరేషన్లను పురాదా కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహిస్తాయనీ, అయితే వీరంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పోలీస్ కమాండోలకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. మావోల దాడి ఘటనను మహారాష్ట్ర డీజీపీ స్వయంగా విచారిస్తారని సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దాడిని ఖండించిన ఎన్హెచ్ఆర్సీ: గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్యను జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఖండించింది. అమరుల కుటుంబాలు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించింది. -
మరాఠాలకు రిజర్వేషన్లు
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం చెప్పారు. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం’ (ఎస్ఈబీసీ – సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్) కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిందనీ, రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలనేది మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయిస్తుందన్నారు. తమిళ నాడులో మాదిరిగా 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశ ముందని భావిస్తున్నారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 68 శాతా నికి చేరతాయి. నేడు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. కీలకమైన మరాఠాలు రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. గతవారం బీసీ కమిషన్ నివేదిక సమర్పించిన వెంటనే మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై ఫడ్నవిస్ సానుకూలగానే స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలు చాలా తక్కువగా ఉన్నారనీ, కాబట్టి వారిని ఎస్‌ఈబీసీలుగా పరిగణిస్తున్నట్లు బీసీ కమిషన్ పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణం 15 (4), 16 (4)ల ప్రకారం ఎస్‌ఈబీసీలకు రిజర్వేషన్ల ఫలాలను అనుమతించవచ్చు. మరాఠాలకు రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్ల శాతం 50కి పైగా పెరిగితే అది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ఇది ప్రత్యేక అంశమని ఫడ్నవిస్ చెప్పారు. -
‘మహా’ అసెంబ్లీలో కరెంటు పోయింది!
నాగ్‌పూర్: భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ అంతరాయం కలగడంతో శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ స్తంభించింది. సభ ప్రారంభం కాకముందే సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం శాసన సభ, మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో చీకటి అలుముకోవడంతో ఒక రోజుకు వాయిదా పడింది. గురువారం రాత్రి నాగ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అసెంబ్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు మాట్లాడాలని భావించినా విద్యుత్ లేకపోవడంతో మైకులు పనిచేయలేదు. మరమ్మతులు జరుగుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగ్దే సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని పార్టీల సభ్యులతో సమావేశమై ఒక రోజుకు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘నగరంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడింది. అయితే గురువారం రాత్రి మాత్రం భారీగా వర్షం పడింది. విద్యుత్ సరఫరా చేసే విభాగం సెల్లార్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది’అని చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహించారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో ‘గుజరాతీ’ కలకలం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వం సోమవారం వివాదంలో చిక్కుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఉభయసభలను ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడగా, సభ్యుల హెడ్ఫోన్లలో ఆ ప్రసంగ అనువాదం మరాఠీకి బదులు గుజరాతీ భాషలో వచ్చింది. ఈ ఘటనతో సభలో కలకలం చెలరేగింది. వెంటనే స్పందించిన సీఎం ఫడ్నవీస్.. ఈ ఘటనపై సభ్యులందరికీ క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. బాధ్యులపై వీలైతే సోమవారం సాయంత్రంలోపే చర్య తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే దాని అనువాదం గుజరాతీలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. అయితే ఈ ఘటన సాంకేతిక సమస్య వల్ల జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు. మరాఠీ భాషా దినోత్సవానికి(ఫిబ్రవరి 27) ఒక్కరోజు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
బోర్డు ఆమోదం తర్వాతే బ్యారేజీల పనులు
ఏప్రిల్ తొలివారంలో తెలంగాణ-మహారాష్ట్ర సీఎంల స్థాయిలో సమావేశం సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల పనులను తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ఆమోదం తర్వాతే చేపట్టనున్నారు. అప్పటివరకు ప్రాజెక్టుల పరిధిలో చిన్నపాటి మా ర్పులు, అవసరమైన అనుమతులు, చేయాల్సిన సర్వేలను పూర్తిచేసుకోనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారుల స్థాయిలో జరిగిన కమిటీ సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో, మేడిగడ్డ బ్యారేజీని 100 మీటర్ల కనీస ఎత్తుతో నిర్మించేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి మార్గంలో నిర్మించే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వ్యయ అంచనాలు సిద్ధం చేసి పెట్టుకుంది. వాటికి పరిపాలనా అనుమతులు ఇచ్చేసి పనులు మొదలుపెట్టాలని భావించింది. ఈ పాటికే టెండర్ల ప్రక్రియను సైతం ముగించాలని భావించినా... అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో వాటిని నిలిపివేశారు. అయితే అధికారుల స్థాయి చర్చల అనంతరం పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంతా భావించినా... భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కా రం ఇవ్వకుండా బోర్డు ఆమోదం తర్వాతే పనులు మొదలుపెట్టాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఏప్రిల్ తొలివారంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర జల వనరుల మంత్రి గిరీశ్ మహాజన్ రాష్ట్రానికి వచ్చే అవకాశముంది.