BJP Asked CM Eknath Shinde To Switch Roles With Devendra Fadnavis: NCP - Sakshi
Sakshi News home page

Maharashtra: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?

Published Tue, Apr 25 2023 4:00 PM | Last Updated on Tue, Apr 25 2023 4:34 PM

BJP Asked CM Eknath Shinde Switch Roles With Fadnavis Says NCP - Sakshi

ముంబై: మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. మీడియా వర్గాలు తనకు ఈ విషయపై కచ్చితమైన సమాచారం అందించాయని పేర్కొన్నారు. 

సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు.

'ఇది నిజమేనా? షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్చుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా?' అని క్యాస్ట్రో ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్‌(ఉద్ధవ్‌ వర్గం)నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్‌ జోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్సీపీ కూడా సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.

కాగా.. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపారు షిండే. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ బెదిరించిందని, తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని పేర్కొన్నారు.
చదవండి:  బీఆర్‌ఎస్‌ దేశంలోనే నంబర్‌-1.. సెకండ్‌ ప్లేస్‌లో ఆప్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement