నాగపూర్: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు శివసేన గుర్తుపై పొలిటికల్ ట్విస్టులు చోటుచేసుకోగా, తాజాగా ఎన్సీపీలో రాజకీయం వేడెక్కింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్‌కు షాక్ తగిలింది. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, ఆయన వర్గానికి మంత్రి పదవులు కూడా ఇచ్చేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అంగీకరించింది. అయితే శాఖల కేటాయింపుల విషయంలో షిండే వర్గం, బీజేపీ, పవార్ వర్గం మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. మరోవైపు, ప్రభుత్వంలోకి అజిత్ పవార్ రాకతో.. మంత్రి పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శిందే వర్గం, బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
అయితే, నితిన్ గడ్కరీ నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ మహా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులకు ఇప్పుడు క్యూ పెరిగింది. మంత్రి పదవి తమదనేని ఆశించిన నేతలకు ఇప్పుడు తాము ‘కుట్టించుకున్న సూట్ల’ను ఏం చేయాలో తెలియడం లేదు అంటూ పొలిటికల్ పంచ్‌లు విసిరారు.
‘ప్రజలు తమకు దక్కిన వాటితో ఎప్పుడూ సంతోషంగా ఉండరు. నేను ఆశించిన దాని కంటే ఎక్కువ పొందాను అని ఓ వ్యక్తి అంగీకరించగలిగితే అప్పుడే అతను సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. లేదంటే కార్పొరేటర్లు తమకు ఎమ్మెల్యే పదవి దక్కలేదని, ఎమ్మేల్యేలు తమకు మంత్రి పదవులు రాలేదని బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు కొందరి పరిస్థితి అలాగే (మహారాష్ట్ర రాజకీయాలను ఉద్దేశిస్తూ)ఉంది. మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన వారు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులు దక్కించుకునేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో తమ వంతు వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. పైగా మంత్రి పదవి ఆశించిన వారు ఇప్పటికే ప్రమాణ స్వీకారం కోసం సూట్లు కుట్టించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రద్దీ పెరగడంతో ఆ సూట్లను ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఛేంజ్.. మోదీ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment