'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు' | PM should focus on Pakistan not Maharashtra says, Shiv Sena | Sakshi
Sakshi News home page

'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'

Published Wed, Oct 8 2014 12:17 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ(ఫైల్) - Sakshi

నరేంద్ర మోడీ(ఫైల్)

ముంబై: మహారాష్ట్రపై దృష్టి పెట్టడం మానేని పాకిస్థాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమేలాగో ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోడీకి శివసేన సూచించింది. నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలపై పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతున్నా అదుపు చేయడంలో మోడీ సర్కారు విఫలమైందని 'సామ్నా' పత్రికలో శివసేన పేర్కొంది.

మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని, పాకిస్థాన్ పై దృష్టి పెట్టాలని సలహాయిచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదని, దృఢమైన సంకల్పం ఉంచే చాలని శివసేన పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయాల గురించి తర్వాతైనా ఆలోచించొచ్చని, అంతకంటే ముందు పొరుగుదేశం దాడులపై స్పందించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement