![shivasena counter attks on bjp power oxyzen - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/27/shiv.jpg.webp?itok=FiNtiZ3c)
ముంబై: కొందరికి అధికారమే ఆక్సిజన్ లాంటిదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎదురుదాడి చేసింది. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ‘మోదీ ఆక్సిజన్ అంటున్న అధికారం కోసమే 2014లో బీజేపీ మాతో పొత్తును తెంచుకుంది’ అని రాసింది. ‘మంచి రోజులు తెస్తామని హామీలిచ్చి విఫలమైన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు’ అని శివసేన బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడింది. మంచిరోజులు (అచ్ఛే దిన్) తెస్తామనే నినాదంతో 2014 ఎన్నికలప్పుడు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే. బీజేపీకి ఆక్సిజన్ లాంటి అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు నేరగాళ్లకు ఆ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందనీ, అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా దొంగలను పవిత్రులను చేస్తోందని శివసేన విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment