achhe din
-
బీజేపీ అస్త్రం. ‘ఆయేగాతో మోదీ హీ’
ఆయేగాతో మోదీ హీ(ఈసారి వచ్చేది కూడా మోదీనే).. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా వాడిన నినాదమిది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అచ్ఛేదిన్ ఆనేవాలే హై(మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో బీజేపీ ఘనవిజయం సాధించింది. అదే తరహాలో ఈసారి మైభీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే) అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కానీ దానికంటే ‘ఆయేగాతో మోదీ హీ’నినాదం చాలా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేని విషయాన్ని ఈ నినాదం ద్వారా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకుడు ఒకరు తెలిపారు. అదే సమయంలో మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరనీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీకి దీటైన ప్రత్యర్థి కారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. ఓవైపు మోదీ, మరోవైపు మాయావతి, రాహుల్ గాంధీ, అఖిలేశ్ ఉండటంతో జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు మోదీకే జైకొట్టారని అభిప్రాయపడ్డారు. -
మోదీ అన్యాయం చేశారు
జలోర్/అజ్మీర్/కోట: ప్రధాని మోదీ గత ఐదేళ్లలో దేశ ప్రజలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ‘అచ్ఛే దిన్ ఆయేంగే’అన్న నినాదం పోయి దాని స్థానంలో ‘చౌకీదార్ చోర్ హై’ వచ్చిందన్నారు. అందరికీ న్యాయం ఒకే ఒక్క ‘హిందుస్తాన్’ ఉండాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. గురువారం రాజస్తాన్‌లోని జలోర్, అజ్మీర్, కోటలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. హిందుస్తాన్‌లో అన్యాయమనేదే ఉండకూడదని, దేశం రెండు హిందుస్తాన్లుగా విభజింపబడకూడదని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజలు ‘మన్ కీ బాత్’విన్నారని, కానీ ‘న్యాయ్’పథకానికి రూపకల్పన చేయడం ద్వారా కాంగ్రెస్ మేధావి వర్గం ‘కామ్ కీ బాత్’చేసిందని అన్నారు. మోదీజీ తెరిపించిన బ్యాంకు ఖాతాల్లోనే ‘న్యాయ్’పథకానికి సంబంధించిన డబ్బులు వేయాలనుకుంటున్నాననిæ చెప్పారు. ఆయా కుటుంబాల మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ‘మన్‌కీ బాత్’(మనసులోని మాట)ను వింటుందని, ఆ మేరకు నడుచుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఒక్క ఏడాదిలోనే 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు. -
‘ఆక్సిజన్’ కోసమే మాతో తెగదెంపులు: సేన
ముంబై: కొందరికి అధికారమే ఆక్సిజన్ లాంటిదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎదురుదాడి చేసింది. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ‘మోదీ ఆక్సిజన్ అంటున్న అధికారం కోసమే 2014లో బీజేపీ మాతో పొత్తును తెంచుకుంది’ అని రాసింది. ‘మంచి రోజులు తెస్తామని హామీలిచ్చి విఫలమైన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు’ అని శివసేన బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడింది. మంచిరోజులు (అచ్ఛే దిన్) తెస్తామనే నినాదంతో 2014 ఎన్నికలప్పుడు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే. బీజేపీకి ఆక్సిజన్ లాంటి అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు నేరగాళ్లకు ఆ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందనీ, అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా దొంగలను పవిత్రులను చేస్తోందని శివసేన విమర్శించింది. -
మంచిరోజులకు ఇంతకన్నా ప్రూఫ్ కావాలా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. కానీ, పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులు ముష్టివేసే డబ్బుల కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. మంచిరోజులకు ఇంతకన్నా రుజువు ఏం కావాలి’అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. పెద్దనోట్ల రద్దును సక్రమంగా మోదీ ప్రభుత్వం అమలుచేయకపోవడాన్ని తప్పుబడుతూ చిదంబరం వరుస ట్వీట్లతో సెటైర్లు గుప్పించారు. ‘లక్షలాది మంది క్యూలలో నిల్చున్నారు. ఉత్పత్తి జిందాబాద్’ అంటూ ట్వీట్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు కంటినిండా నిద్రపోతున్నారని, ధనికులే నిద్రమాత్రలు మింగుతున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ‘చూడండి వేలాదిమంది ‘ధనికులు’, ‘అవినీతిపరులు’ క్యూలో నిలుచున్నారు. పేదలు తమ ఇళ్ల నుంచి వారిని చూస్తూ ఆనందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.